పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?

Publish Date:May 3, 2025

Advertisement

 


ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం. కానీ ఇప్పట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎక్కువ వింటూ ఉన్నాం.  దీన్నే పిత్తాశయంలో రాళ్లు అని అంటారు.  చాలా మంది ఈ మధ్య కాలంలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా కారణాల వల్ల జరగవచ్చు. కానీ ముఖ్యంగదా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం.  చెడు జీవనశైలి వల్ల పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని చెబుతారు. అయితే అసలు పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి తెలుసుకుంటే..

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణం పిత్తంలో ఉండే బిలిరుబిలిన్, లవణాలు,  మూలకాల అసమతుల్యత.  ఇవి అసమతుల్యతగా ఉన్నట్టైతే  పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి.

పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది సాధారణంగా ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.  ఊబకాయం ఉన్న వారిలో కొలెస్ట్రాల్  స్థాయి ఎక్కువగా ఉంటుంది.  ఈ అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయంలో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మహిళలలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే అది హార్మన్లలో మార్పులు,  ముఖ్యంగా అధిక ఈస్ట్రోజెన్ స్థాయిల వల్ల జరుగుతుందని అంటున్నారు.  వీటి వల్లే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయట.

ఆహారంలో ఫైబర్ లేకపోవడం,  జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.  ఇది పిత్త అసమతుల్యతకు,  పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది.  అందుకే ఆహారంలో ఫైబర్ ను తీసుకోవాలి. అలాగే జీర్ణ సమస్యలు ఏవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  జీర్ణసమస్యలు వస్తే వెంటనే పరిష్కారం అయ్యేలా చూసుకోవాలి.పోషకాలు అధికంగా ఉన్న,  ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా  పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.


                                            *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.