రాజ్యసభ అభ్యర్థిగా గల్లా జయదేవ్ కు తెలుగుదేశం టికెట్?

Publish Date:Sep 11, 2024

Advertisement

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు యోచిస్తున్నారా? అంటే తెలుగుదేశం వర్గీయుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. వైసీపీ హయాంలో కక్షసాధింపు రాజకీయాలతో విసిగివేసారిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వందల, వేల కోట్ల పన్ను చెల్లిస్తూ కూడా ప్రభుత్వాల వేధింపులకు గురికావలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ సర్కార్ రాజకీయ వేధింపుల కారణంగా గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆగలేదు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్ సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరలించేశారు. 

కేవలం రాజకీయ కక్ష సాధింపు, వేధింపులు తప్ప మరోటి తెలియని జగన్ కు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ గా నిలిచి, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తిగా గుర్తింపు పొందిన అమరరాజా బ్యాటరీస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేయడమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలువులోతు గొయ్యి తీసి కప్పెట్టేయడమేనని తెలిసినా, రాష్ట్రం కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత కక్ష సాధింపులే ముఖ్యంగా భావించారు. అందుకే అధికారంలో ఉన్నామన్న అహంతో   ట్యాక్స్‌ రూపంలో   ఏపీ ప్ర‌భుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర ప‌న్నులు క‌డుతున్న అక్ష‌య పాత్ర‌లాంటి కంపెనీ రాష్ట్రం తరిలిపోయేలా చేశారు. అసలా కంపెనీని మూయించడమే లక్ష్యంగా జగన్ తాను అధికారంలో ఉండగా పావులు కదిపారు. ఆ పని చేసేసే వారే అయితే కంపెనీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మరీ జగన్ యత్నాలను అడ్డుకుంది.  నిబంధ‌న‌లన్నీ పక్కాగా ఫాలో అవుతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీ అయిన అమరరాజా బ్యాటరీస్ పై అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాలుష్యం పేరుతో  మూయించాలని చూడటం వెనుక ఉన్నది రాజకీయమేనని అప్పట్లోనే పారిశ్రామికవర్గాలు గగ్గోలు పెట్టాయి.

అయినా అధికార అహంతో కన్నూమిన్నూగాకుండా వ్యవహరించిన జగన్ సర్కార్ కంపెనీ మూసివేయించేయాలన్న పట్టుదలతో అడుగులు వేసింది. అయితే అమరరాజా సర్కర్ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ దుష్టయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంది. అయితే ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్న తీరుతో విసిపిపోయిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం ఏపీకి గుడ్ బై చెప్పేసి పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలిపోయింది. ఇక్కడి సర్కార్ బంగారుబాతు లాంటి అమరరాజా బ్యాటరీస్ ను తరిమిగొడితే తెలంగాణ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది.  
వాస్తవానికి గల్లా జయదేవ్ కు అమరరాజా బ్యాటరీస్ కు ఉన్న అనుబంధం అంతా ఇంత అని చెప్పలేం. రాష్ట్ర విభజన తరువాత తాము చెల్లించే పన్నులు.. త‌మ సొంత‌ రాష్ట్రానికే దక్కాలనే కార‌ణంతో  అమరరాజా బ్యాటరీస్ తన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి తరలించింది. అలాంటి కంపెనీని జగన్ సర్కార్ రాష్ట్రం నుంచి తరిమేసింది. 

ఇలా ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఉద్యోగ‌, ఉపాధి, సామాజిక సేవ‌లో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమ‌ర‌రాజా కంపెనీని గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ అన్న ఏకైక కారణంతో  వేధించి రాష్ట్రం నుంచి తరిమేసింది.  జగన్ సర్కార్ వేధింపులతో విసిగిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రాష్ట్రంలో  తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువు దీరిన తరువాత ఒకింత చురుకుగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ కు సముచిత స్థానం ఇచ్చి, రాజ్యసభ సభ్యుడిగా పంపి ఆయన సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.

వైసీపీ నుంచి ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు  ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికి మెపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిరువురిలో మోపిదేవి వెంకటరమణ స్థానంలో గల్లా జయదేవ్ ను రాజ్యసభక పంపాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. మంచి వక్త అయిన గల్లా జయదేవ్ ను రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తే తెలుగుదేశం తరఫున రాజ్యసభలో బలంగా గొంతెత్తగలరన్న భావన తెలుగుదేశం వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.