గల్లా ఫుడ్స్ పై చిత్తూరు జిల్లా రైతుల ఆగ్రహం
Publish Date:Mar 21, 2012
Advertisement
రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీపై జిల్లా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లా కుటుంబం పూతలపట్టు వద్ద వందలాది కోట్లు వెచ్చించి వ్యవసాయ ఆధార పరిశ్రమను ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రధానంగా పండే మామిడి, అరటి, బత్తాయి పంటలను రైతులనుంచి కొనుగోలుచేసి జ్యూస్, పల్స్ గా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మా పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని మొదట రైతులు భావించారు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితులు ఉండడంతో వారు ఫ్యాక్టరీ యాజమాన్యంపై కన్నెర్రజేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జిల్లాలోని మిగిలిన వ్యాపారులతో కుమ్ముక్కై తాము నిర్ణయించిన రేటుకే మామిడి, అరటి, బత్తాయి విక్రయించాలని పట్టుబడుతున్నారు. వ్యాపారులంతా ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్ముక్కుకావడంతో గత ఏడాది రైతులు బాగా నష్టపోయారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తడంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది తాము సుమారు లక్ష టన్నుల మామిడిని కారు చౌకగా గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీకి విక్రయించామని, తాము పండించిన పంటతో ఫ్యాక్టరీకి సుమారు రూ.30 కోట్ల లాభం వచ్చిందని రైతులు అంటున్నారు. ఈ సీజన్ లో తాము నిర్ణయించిన ధరను ఫ్యాక్టరీ యాజమానయం చెల్లించకపొతే తమ పంటను వేరే చోటికి తరలిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. నిజానికి తమకు చిత్తూరుజిల్లా మారుమూల ప్రాంతంలో వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్యాక్టరీని ఏర్పాటుచేయాల్సిన అవసరంలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం అంటోంది. ఈ ప్రాంత అభివృద్ధికోసమే తాము ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఫ్యాక్టరీ నిర్మించామని, రైతులు ఈ పరిస్థితిని అర్థంచేసుకోవాలని యాజమాన్యం అంటోంది. అయితే రైతుల వాదన మరోలా ఉంది. గ్రామీణ ప్రాంతంలో మంత్రి గల్లా అరుణకుమారి భర్త ఫ్యాక్టరీని నెలకొల్పి కేంద్రప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సబ్సీడీలు పొందారని, అంతేకాక అధికారులను లొంగదీసుకుని అటవీ భూములను ఆక్రమించుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మామిడి రేటుపై ఈ ఏడాది గల్లా ఫుడ్స్ స్థానిక రైతులకు మధ్య వివాదం తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
http://www.teluguone.com/news/content/galla-aruna-kumari-24-12827.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





