చెంచల్ గూడ చెరశాలలో గాలి
Publish Date:May 6, 2025
Advertisement
కర్ణాటక మాజీమంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం (మే7) గాలి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం గాలి జనార్ధనరెడ్డి సహా ఐదుగురినీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్ గుడా జైలుకు తరలించారు. అంతకు ముందు తుది తీర్పునకు ముందు.. తాను ఇప్పటికే నాలుగేళ్ల జైలు జీవితం అనుభవించాననీ, దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలనీ కోరారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. మీ నేరాలకు యావజ్జీవ శిక్షకు అర్హులు అని వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్ కేసులో పదేళ్ల జైలు ఎందుకు విధించకూడదో చెప్పండంటూ ప్రశ్నించింది. అనంతరం ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గతంలో ఇదే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిలు కోసం ఏకంగా న్యాయమూర్తికే ముడుపులు ఇచ్చారు. అప్పట్లో కూడా చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిలు వచ్చేలా సమీపబంధువు మధ్యవర్తిత్వంతో న్యాయమూర్తికి వంద కోట్టు ముడుపులు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ మేరకే గాలి జనార్దన్ రెడ్డికి అప్పట్లో బెయిలు లభించింది. అయితే ఈ కేసులో అప్పటి న్యాయమూర్తి పట్టాభిరామారావు కూడా అరెస్టయ్యారు.
http://www.teluguone.com/news/content/gali-janardanreddy-in-chanchalaguda-jail-25-197598.html





