చీలిక దిశగా బీజేపీ.. గడ్కరీ నేతృత్వంలో మోడీ షాలపై తిరుగుబావుటా?

Publish Date:Aug 24, 2022

Advertisement

నితిన్ గడ్కరీ తిరుగుబావుటా ఎగురవేయనున్నారా? బీజేపీలో చీలిక అనివార్యమా? మోడీ, షా ద్వయం తీరు పట్ల పార్టీలో గూడుకట్టుకున్న అసమతి భగ్గుమంటుందా? ఈ ప్రశ్నలకు పరిశీలకులు ఔననే అంటున్నారు. నితిన్ గడ్కరీకి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికిన తరువాత పార్టీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. మోడీ, షా ద్వయం పార్టీలో ఎవరినీ సొంతంగా ఆలోచించడానికి కానీ, స్వతంత్రంగా పని చేయడానికి కానీ అవకాశం ఇవ్వడం లేదన్న అసంతృప్తి, అసమ్మతి పార్టీలో గూడు కట్టుకుని ఉన్నాయనీ, అయితే గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించకపోవడంతో కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రిగా, మోడీ విధానాలలోని లోపలను ఎత్తి చూపగలిగే ధైర్యం ఉన్న నాయకుడిగా పేరొందిన ఒకే ఒక్కడికి పొమ్మనకుండా పొగపెట్టేందుకు రంగం సిద్ధమైందని పార్టీ శ్రేణులకు సైతం అవగతమైంది.

గడ్కరీ పార్టీలో బలమైన నేతగా, అత్యధికులకు ఇష్టమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలో మోడీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి బాగా వ్యక్తమైన సమయంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానిగా గడ్కరీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. పైగా నితిన్ గడ్కరీ నాగపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నేత. నీటికీ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. అటువంటి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేయడమంటే.. పార్టీకి సిద్ధాంత పునాదిని వేసిన ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిరస్కరించడమేగా పార్టీలోని పలువురు భావిస్తున్నారు. పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ, షా ద్వయమే అన్నట్లగా పరిస్థితి మారిపోయింది. గతంలో కాంగ్రెస్ ను వ్యక్తిపూజ అంటే విమర్శలు గుప్పించిన బీజేపీలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

గడ్కరీ తన అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేస్తే ఆయనతో గొంతు కలిపేందుకు పార్టీలో చాలా మంది సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా ఇప్పటికే ఖాళీ అయిపోయిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా గడ్కరీ నాయకత్వం కింద పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నాయని అంటున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల తీరు పట్ల మోడీ షా ద్వయం వ్యవహార తీరును గతంలో పలుమార్లు గడ్కరీ తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శివసేన విషయంలో మోడీ షా ద్వయం వ్యవహరించిన తీరును గడ్కరీ వ్యతిరేకించారని అంటున్నారు. రాజకీయాలంటే కేవలం అధికారం కోసం వెంపర్లాట మాత్రమే కాదని ఒకింత నిర్వేదంగా వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే.

గడ్కరీ ఎవరు ఔనన్నా కాదన్నా బీజేపీలో కీలక నేత. నంబర్ గేమ్ లో ఉండరు కానీ, ఆయనను కాదనే వారు కానీ కాదని అనగలిగే వారు కానీ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ కు అత్యంత ఆప్తుడు. నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఆయనకు బోలెడంత పలుకుబడి కూడా ఉంది. గతంలో ఆర్ఎస్ఎస్ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్న ప్రశ్నకు గడ్కరీ పేరే చెప్పింది.

ఈ రోజుకూ మోడీకి రీప్లేస్ మెంట్ ఎవరంటే ఎవరైనా గడ్కరీ పేరే చెబుతారు. అటువంటి గడ్కరీ రాజకీయాలపై వైరాగ్యం ప్రదర్శించారు.  ఎందుకొచ్చిన రాజకీయాలు? ఎవరి కోసం అంటూ వేదాంతం వల్లించారు. అదేదో స్వగతంలోనో.. సన్నిహితుల దగ్గర పిచ్చాపాటీ మాట్లాడుతూనో కాదు. ఒక సభలో. అదీ మాజీ పొలిటికల్ లీడర్ గిరీష్ గాంధీ సన్మాన సభలో. గడ్కరీ అంతటి వారు రాజకీయాలపై అంతటి వైరాగ్యం ప్రదర్శించడంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అధికార బీజేపీలో బలమైన నాయకుడు ఒక్క సారిగా రాజకీయం అంటేకేవలం అధికార దాహం, పదవీ వ్యామోహం అంటూ వ్యాఖ్యానించే సరికి ఒక్క సారిగా బీజేపీలో కలకలం రేగింది.

గడ్కరీ అలా మాట్లాడడానికి కారణమేమిటన్న చర్చ మొదలైంది. రాజకీయం అంటే అధికార దాహం, పదవీ వ్యామోహం అన్న మాటలు ఆయన ఎవరిని టార్గెట్ చేసి అని ఉంటారా అన్న అనుమానాలు ఒక్క సారిగా బీజేపీలోనే కాదు అన్ని రాజకీయ పార్టీలలోనూ కలిగాయి.  సామాన్య జనం కూడా గడ్కరీ వ్యాఖ్యలు మర్మమేమిటన్న చర్చల్లో మునిగిపోయారు.  కేంద్రంలో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీలో అత్యంత కీలక నాయకుడు ఏమిటీ రాజకీయం కేవలం అధికార వ్యామోహం అంటే ఉలిక్కిపడేవారు అందులోనే ఎక్కువగా ఉంటారు. సమాజి హితం, అభివృద్ధి దిశగా మార్పు, పురోగతి ఇవే రాజకీయాల లక్ష్యంగా ఉండాలని, గతంలో అలాగే ఉండేవని చెప్పిన గడ్కరి ఇప్పుడు రాజకీయాల అర్ధం పూర్తిగా మారిపోయిందన్నారు. రాజకీయాలంటే అధికారాన్ని అనుభవించడమే అన్నట్లు ప్రస్తుత పరిస్థితి తయారైందనీ, అందుకే తాను రాజకీయాలలో కొనసాగుతూ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ గడిపేయాలా సమాజం కోసం పని చేయాలా అన్న ఆలోచనలో ఉన్నానని చెప్పారు.

ఈ వ్యాఖ్యల తరువాతే ఆయనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్థానం గల్లంతైంది. దీనిని బట్టే గడ్కరీ వ్యాఖ్యలు మోడీ, షా ద్వయం భుజాలు తడుముకునేలా చేశాయని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్లమెంటరీ బోర్డులో స్థానం కోల్పియిన తరువాత కూడా గడ్కరీ తన అసమ్మతి గళాన్ని విప్పడం కొనసాగించారు. పార్టీ ఈ రోజు అధికారంలో ఉందంటే అందుకు వాజ్ పేయి, అద్వానీల కృషి, వేసిన పునాదే కారణమని అన్నారు. నాగపూర్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీజేపీ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి వాజ్ పేయి, అద్వానీ వంటి వారే కారణమన్నారు. లోక్ సభలో కేవలం రెండు స్థానాలున్న బీజేపీ ఈ రోజు జాతీయ స్థాయిలో అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కంచుకోగలిగిందంటే అందుకు వారి కృషే కారణమనిపేర్కొన్నారు.

వాజ్‌పేయి, అద్వానీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారితోపాటు కార్యకర్తల కృషి కారణంగానే నేడు మోదీ నాయకత్వంలో పార్టీ అధికారంలో ఉందని పేర్కొన్నారు.రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారని.. అయితే, దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజిక, ఆర్థిక సంస్కర్తలు దూరదృష్టితో ఆలోచిస్తారనీ, వారి విజన్  శతాబ్దం మేలు గురించి కూడా ఆలోచిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన   గతంలో ముంబైలో ఒక సదస్సులో వాజ్ పేయి చేసిన ప్రసంగాన్ని గుర్తించారు. ‘చీకటి ఏదో ఒక రోజున తొలగిపోతుంది, సూర్యుడు బయటకు వస్తాడు, కమలం వికసిస్తుందని వాజ్ పేయి అన్నారనీ, ఆ రోజు ఆ సదస్సులో తానూ ఉన్నాననీ గుర్తు చేసుకున్నారు. గడ్కరీ వ్యాఖ్యల వెనుక ప్రస్తుత పరిస్థితులు మారుతాయనీ త్వరలోనే మార్పు తప్పదన్న సంకేతం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆ మార్పు తన నాయకత్వంలోనే మొదలౌతుందన్న సంకేతం కూడా గడ్కరీ మాటల వెనుక ఉందని అంటున్నారు.

 రాత్రికి రాత్రి మహారాష్ట్రలో ప్రభుత్వం మారిపోవడం, నిన్నటి దాకా బీజేపీపై విమర్శలతో నిప్పులు చెరిగిన శివసేనలోని ఒక వర్గం బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  రాష్ట్రాలలో అధికారం కోసం మోడీ సర్కార్ వేస్తున్న ఎత్తులు, పన్నుతున్నవ్యూహాలపై గడ్కరీ అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. గడ్కరీ రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యల టార్గెట్ నిస్సందేహంగా మోడీయే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా ఒక సారి గడ్కరీ.. నాయకుడనే వాడు విజయాలకే కాదు పరాజయాలకు కూడా బాధ్యత వహించాలని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గడ్కరీ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వెంట నడవడానికి బీజేపీలోని ఒక బలమైన వర్గమే కాదు. గడ్కరీ మద్దతుగా నిలవడానికి పలు రాష్ట్రాలలో బీజేపీ యేతర పార్టీలూ సిద్ధంగా ఉన్నాయి.

ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ గడ్కరీ నాయకత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాయి. ఇక మోడీని గట్టిగా వ్యతిరేకించే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇలా చాలా మంది ముఖ్యమంత్రులు గడ్కరీ నాయకత్వంలో పార్టీలో చీలిక వస్తే కనుక గడ్కరీకి మద్దతుగా నిలిచేందుకు సదా సిద్ధమన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే గడ్కరీ తన అసమ్మతి గళాన్ని మరింత గట్టిగా వినిపించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో మోడీషా ద్వయం ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా గడ్కరీతో గళం కలిపేందుకు, కలిసి అడుగు వేసేందుకు బీజేపీలోని ఒక వర్గం సిద్ధంగా ఉందనీ, ఆర్ఎస్ఎస్ కూడా గడ్కరీనే సమర్ధిస్తోందని అంటున్నారు. అదే జరిగితే గడ్కరీ నాయకత్వాన్ని సమర్ధించేందుకు ఎన్డీయే నుంచి వైదొలగిన భాగస్వామ్య పక్షాలే కాదు, ఇప్పటికీ కొనసాగుతున్న పార్టీలూ, బీజేపీని గట్టిగా వ్యతిరేకించే పార్టీలూ కూడా ముందుకు వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే.. మోడీ, షాలకు వ్యతిరేకంగా కమలం పార్టీలో తిరుగుబావుటా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు. ఆ తిరుగుబాటు గడ్కరీ నేతృత్వంలోనే మొదలౌతుందనీ అంటున్నారు.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.