గడ్కరీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఆయనేమన్నారంటే?

Publish Date:Jun 17, 2023

Advertisement

కేంద్ర  రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి  విలక్షణ రాజకీయ నాయకునిగా పేరుంది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపని, చూపలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క గడ్కరీనే. కేంద్ర కేబినెట్ లో స్వతంత్రంగా , స్వేచ్ఛగా వ్యవహరించే మంత్రి ఎవరంటే వినిపించే మొదటి, ఏకైక పేరు గడ్కరీదే.  

అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో  దేశం ఏమి సాదించింది అంటే  ముందుగా చెప్పేది, చెప్పుకునేది మౌలిక సదుపాయాల కల్పన గురించే . అందులోనూ గడ్కరీ నేతృత్వంలో అత్యంత వేగంగా సాగుతున్న  జాతీయ, గ్రామీణ రోడ్ల నిర్మాణం గురించే ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే పార్లమెంట్ లోపలా, బయటా కూడా ప్రతిపక్ష పార్టీలు గడ్కరీ వైపు వేలెత్తి చూపే సాహసం చేయవు. అంతే కాదు  మోదీ ప్రభుత్వాన్ని అడ్డు అదుపు లేకుండా విమర్శించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పార్టీ  మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఒకటి రెండు సందర్భాలలో లోక్ సభలో గడ్గరీని మెచ్చుకున్నారు. ఆయనను అభినందించారు. అలాగే ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా  బీజేపీని, మోడీని విమర్శించినంతగా గడ్కరీని విమర్శించే సాహసం చేయరు.   

అలాగే  గడ్కరీ మీడియా సమావేశాల్లో ప్రవర్తించే తీరు కూడా భిన్నంగానే ఉంటుంది. ఒకా నొక సందర్భంలో ఆయన బీజేపీ ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించినంత సమర్ధవంతంగా అధికార పార్టీ పాత్రను పోషించేలేక పోతోందని అంగీకరించారు. అంతే కాదు తమ డీఎన్ఏనే అలాంటిందని చమత్కరించారు. 
అలాగే ఇప్పుడు గడ్గరీ మరో సంచలన ప్రకటన చేశారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకో బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించిన నితిన్ గడ్కరీ.. సదరు నేతకు తన దైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే అది ఇప్పటి విషయం కాదు. గతంలో ఎప్పుడో  కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన దివంగత శ్రీకాంత్ జిచ్‌కార్ ఓసారి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు గడ్కరీ గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్ జిచ్‌కార్ తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించినట్లు చెప్పారు.

పార్టీ కోసం చాలా కష్టపడతానని తనను పొగిడాడనీ,  తాను మంచి కార్యకర్తే కాకుండా మంచి నాయకుడిని అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే,  మంచి భవిష్యత్ ఉంటుందని సూచించినట్లు చెప్పారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడం కంటే బావిలో దూకడం చాలా బెటర్ అని శ్రీకాంత్ జిచ్‌కార్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.

ఎందుకంటే తనకు బీజేపీపై, బీజేపీ ఐడియాలజీపై   సంపూర్ణ విశ్వాసం ఉందనీ.. అందు కోసమే తన పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌కు విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో ఉన్నపుడు తనకు విలువలు నేర్పించినందుకు ఆర్ఎస్ఎస్‌పై పొగడ్తలు కురిపించారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హస్తం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి చాలా సార్లు చీలిపోయిందని ఆరోపించారు. మనం మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను మరిచిపోకూడదనీ, మెరుగైన భవిష్యత్ కోసం గతం నుంచి నేర్చుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గరీబీ హటావో (పేదరిక నిర్మూలన) అనే నినాదాన్ని ఇచ్చిందని.. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇదే సమయంలో గడ్కరీ ... ప్రధాని మోడీతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు సమాధానం చెప్పారు.

భారత్‌ను ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్‌పవర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను నితిన్ గడ్కరీ ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో దేశ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పనుల కన్నా.. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. ఏమైనా  బీజేపీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్కరీ ... ఎదో ఒక రోజున దేశ ప్రధాని అయినా ఆశ్చర్య పోనవసరం లేదని బీజేపీ నేతలు  కొందరు గట్టిగా విశ్వసిస్తారు.

By
en-us Political News

  
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.