గడ్కరీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఆయనేమన్నారంటే?
Publish Date:Jun 17, 2023
Advertisement
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి విలక్షణ రాజకీయ నాయకునిగా పేరుంది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపని, చూపలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క గడ్కరీనే. కేంద్ర కేబినెట్ లో స్వతంత్రంగా , స్వేచ్ఛగా వ్యవహరించే మంత్రి ఎవరంటే వినిపించే మొదటి, ఏకైక పేరు గడ్కరీదే. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఏమి సాదించింది అంటే ముందుగా చెప్పేది, చెప్పుకునేది మౌలిక సదుపాయాల కల్పన గురించే . అందులోనూ గడ్కరీ నేతృత్వంలో అత్యంత వేగంగా సాగుతున్న జాతీయ, గ్రామీణ రోడ్ల నిర్మాణం గురించే ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే పార్లమెంట్ లోపలా, బయటా కూడా ప్రతిపక్ష పార్టీలు గడ్కరీ వైపు వేలెత్తి చూపే సాహసం చేయవు. అంతే కాదు మోదీ ప్రభుత్వాన్ని అడ్డు అదుపు లేకుండా విమర్శించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఒకటి రెండు సందర్భాలలో లోక్ సభలో గడ్గరీని మెచ్చుకున్నారు. ఆయనను అభినందించారు. అలాగే ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా బీజేపీని, మోడీని విమర్శించినంతగా గడ్కరీని విమర్శించే సాహసం చేయరు. అలాగే గడ్కరీ మీడియా సమావేశాల్లో ప్రవర్తించే తీరు కూడా భిన్నంగానే ఉంటుంది. ఒకా నొక సందర్భంలో ఆయన బీజేపీ ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించినంత సమర్ధవంతంగా అధికార పార్టీ పాత్రను పోషించేలేక పోతోందని అంగీకరించారు. అంతే కాదు తమ డీఎన్ఏనే అలాంటిందని చమత్కరించారు. పార్టీ కోసం చాలా కష్టపడతానని తనను పొగిడాడనీ, తాను మంచి కార్యకర్తే కాకుండా మంచి నాయకుడిని అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే, మంచి భవిష్యత్ ఉంటుందని సూచించినట్లు చెప్పారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం కంటే బావిలో దూకడం చాలా బెటర్ అని శ్రీకాంత్ జిచ్‌కార్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఎందుకంటే తనకు బీజేపీపై, బీజేపీ ఐడియాలజీపై సంపూర్ణ విశ్వాసం ఉందనీ.. అందు కోసమే తన పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌కు విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో ఉన్నపుడు తనకు విలువలు నేర్పించినందుకు ఆర్ఎస్ఎస్‌పై పొగడ్తలు కురిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హస్తం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి చాలా సార్లు చీలిపోయిందని ఆరోపించారు. మనం మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను మరిచిపోకూడదనీ, మెరుగైన భవిష్యత్ కోసం గతం నుంచి నేర్చుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గరీబీ హటావో (పేదరిక నిర్మూలన) అనే నినాదాన్ని ఇచ్చిందని.. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇదే సమయంలో గడ్కరీ ... ప్రధాని మోడీతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు సమాధానం చెప్పారు. భారత్‌ను ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్‌పవర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను నితిన్ గడ్కరీ ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో దేశ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన పనుల కన్నా.. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. ఏమైనా బీజేపీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్కరీ ... ఎదో ఒక రోజున దేశ ప్రధాని అయినా ఆశ్చర్య పోనవసరం లేదని బీజేపీ నేతలు కొందరు గట్టిగా విశ్వసిస్తారు.
అలాగే ఇప్పుడు గడ్గరీ మరో సంచలన ప్రకటన చేశారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకో బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించిన నితిన్ గడ్కరీ.. సదరు నేతకు తన దైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే అది ఇప్పటి విషయం కాదు. గతంలో ఎప్పుడో కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన దివంగత శ్రీకాంత్ జిచ్‌కార్ ఓసారి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు గడ్కరీ గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్ జిచ్‌కార్ తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించినట్లు చెప్పారు.
http://www.teluguone.com/news/content/gadkari-reject-congress-offer-39-156976.html





