నరేంద్ర మోదీ వారసుడు గడ్కరీ!
Publish Date:Jul 15, 2025

Advertisement
రాష్ట్రీయ సయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్.. ఇంచుమించుగా వారం రోజుల కిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న ప్రధానమంత్రి రిటైర్మెంట్ గురించి, సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది. నిజానికి.. ఆర్ఎస్ఎస్ అధినేత, ప్రదాని మోదీని ఉద్దేశించే రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారా, లేక అన్యాపదేశంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేకపోయినా మోహన్ భగవత్ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు భగవత్ వ్యాఖ్యలను మోదీని విమర్శించేందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం ,రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదని, ఉండరాదని అంటున్నారు. కాగా.. తాజాగా, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ ఇంకో ముందడుగు వేశారు. నరేంద్ర మోడీ 75 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా చేయాలని ప్రతిపాదించారు.
దేశానికి తదుపరి ప్రధానమంత్రి గడ్కరీ కావాలి.. ఎందుకంటే గడ్కరీ సామాన్యులకు అండగా ఉన్నారు. రహదారులు మౌలిక సదుపాయాల పరంగా దేశాభివృద్ధికి గడ్కరీ గట్టి పునాదులు వేశారు అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
అలాగే, ధనిక, పేదల మధ్య పెరుగుతున్న అంతరం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గడ్కరీ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయనకు దేశాభివృద్ధికి సంబంధించి ఒక భావన ఉందని, అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిని చేయాలని అన్నారు. 75 ఏళ్లు నిండిన వారు రాజీనామా చేయాల్సి ఉంటుందని మోహన్ భగవత్ సూచించారు. కాబట్టి గడ్కరీకి సమయం ఆసన్నమైందని తానూ భావిస్తున్నట్లు గోపాల అన్నారు. అంతే కాదు.. ఆయన ఇక్కడ కర్ణాటక మాజే ముఖ్యమంత్రి యెడియూరప్పను, 75 సంవత్సరాలు నిండగానే రాజీనా చేయించిన విషయాన్ని గుర్తు చేసారు. ఆయనకో రూలు మోడీకి ఓ రూలు ఏమిటని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/gadkari-in-place-of-modi-as-pm-39-202061.html












