డేటా సెంటర్ల భవిష్యత్ కు ఢోకా లేదు.. అమెరికాతో పోలిక సరికాదు!

Publish Date:Jun 2, 2026

Advertisement

భారతదేశం సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ తరుణంలో, భారీ డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం అత్యంత అవసరంగా మారింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. అయితే.. ఇటువంటి భారీ ప్రాజెక్టుల వల్ల విద్యుత్, నీరు వంటి సహజ వనరులు పూర్తిగా హరించిపోతాయంటూ కొందరు మే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలు చాలావరకు పాశ్చాత్య మీడియా, ముఖ్యంగా అమెరికా అనుభవాలను చూసి పుట్టుకొచ్చినవే. అమెరికాలో డేటా సెంటర్ల వల్ల అక్కడి పవర్ గ్రిడ్‌లు కుప్పకూలుతున్నాయనే వార్తలను ఆధారం చేసుకుని, భారత్‌లో కూడా అదే జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో..  ఆంధ్రప్రదేశ్ ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ అపోహలను పూర్తిగా కొట్టిపారేశారు. అమెరికా పరిస్థితులకు, భారతీయ వాస్తవాలకు అస్సలు పోలికే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అమెరికా డిజిటల్ మార్కెట్‌ను చూసిఇండియాను అంచనా వేయడం ముమ్మాటికీ తప్పుడు అవగాహనే అని లోకేష్ తేల్చారు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను నారా లోకేష్ గణాంకాలతో సహా వివరించారు.  "వన్ నేషన్, వన్ గ్రిడ్"  ఇండియాకు ఉన్న  అతిపెద్ద వ్యూహాత్మక ఆయుధమని విశ్లేషించారు. 

ఇండియా  మొత్తం ఒకే రకమైన, ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన జాతీయ పవర్ గ్రిడ్ వ్యవస్థ ద్వారా నడుస్తోంది. కానీ.. అందుకు భిన్నంగా  అమెరికాలో ఏకీకృత జాతీయ పవర్ గ్రిడ్ లేదు. అక్కడ విద్యుత్ వ్యవస్థ అంతా ముక్కలుగా, మూడు ప్రధాన స్వతంత్ర బ్యాలెన్సింగ్ అథారిటీలుగా,   వేల సంఖ్యలో   స్థానిక ప్రైవేట్ యుటిలిటీ సంస్థలుగా విచ్ఛిన్నమై ఉంది. దీనివల్ల అమెరికాలోని ఏదైనా ఒక నిర్దిష్ట రాష్ట్రంలో లేదా కౌంటీలో భారీ డేటా సెంటర్ల క్లస్టర్ ఏర్పడినప్పుడు, ఆ ప్రాంతంలోని స్థానిక విద్యుత్ సరఫరాదారుపై  తట్టుకోలేనంత  భారం పడుతుంది. అక్కడ స్థానికంగా విద్యుత్ కొరత ఏర్పడితే.. వేల మైళ్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల నుండి అదనపు విద్యుత్‌ను సులభంగా రప్పించుకునే సాంకేతిక వీలు అమెరికాకు లేదు. ఫలితంగా అక్కడ పవర్ బ్లాకౌట్‌లు రావడం..  కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం సర్వసాధారణంగా మారింది.

అయితే ఇండియాకు  ఆ ముప్పు లేదు. ఇక్కడ జాతీయంగా అనుసంధానించబడిన సింక్రనైజ్డ్ గ్రిడ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే ఒక పెద్ద డేటా సెంటర్ హబ్‌కు భారీగా విద్యుత్ అవసరమైతే..  ఆ విద్యుత్ ను కేవలం స్థానిక ప్రాంతీయ ప్లాంట్ల నుంచే సేకరించాల్సిన అవసరం లేదు. జాతీయ గ్రిడ్ ద్వారా దేశంలోని ఏ మూల నుంచైనా మిగులు విద్యుత్‌ను విశాఖపట్నం డేటా సెంటర్‌కు క్షణాల్లో మళ్లించవచ్చు. ఈ అద్భుతమైన మౌలిక సదుపాయాల వల్లే భారతదేశం ఏ ప్రాంతంపైనా ఒత్తిడి పడకుండా ఎంతటి భారీ డిజిటల్ కేంద్రాలనైనా సురక్షితంగా నిర్వహించగలదు.

ఇక వనరుల వినియోగం గురించి వస్తున్న విమర్శలు కూడా   ఊహాజనితమైనవేనని మంత్రి నారా లోకేష్ అన్నారు.  డేటా సెంటర్ల కూలింగ్ కోసం వాడే నీటి పరిమాణంపై కొందరు చేస్తున్న హడావుడిని ఆయన గణాంకాలతో తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏకంగా 6.5 గిగావాట్ల  సామర్థ్యం గల భారీ డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్టు మొత్తానికి కలిపి అవసరమయ్యే నీరు కేవలం 1 టీఎంసీ   మాత్రమే. దీనిని మన సహజ వనరులతో పోల్చి చూస్తే అది అత్యంత స్వల్పం. ప్రతి ఏటా  గోదావరి  గుండా దాదాపు 3,000 టీఎంసీల  వర్షపు నీరు ఎలాంటి ఉపయోగం లేకుండా సముద్రంలో   కలిసిపోతోంది. సముద్రం పాలు అవుతున్న ఆ వేల టీఎంసీల నీటితో పోలిస్తే..  డిజిటల్ విప్లవానికి ఐటీ హబ్‌ల కోసం వాడే ఈ ఒక టీఎంసీ నీరు చాలా చిన్న భాగమన్నారు లోకేష్. 

అరకొర సమాచారంతో, పాశ్చాత్య దేశాల తప్పుడు ఉదాహరణలను చూపిస్తూ భారతదేశ ఆర్థిక వృద్ధిని, పారిశ్రామిక పురోగతిని అడ్డుకోవడం సరికాదని   హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి, గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదగడానికి భారతదేశానికి అన్ని రకాల అర్హతలు,  నిర్మాణ సామర్థ్యాలు ఉన్నాయన్న లోకేష్. ఇండియాకు ఉన్న  ఏకీకృత జాతీయ పవర్ గ్రిడ్ వ్యవస్థే ఈ సాంకేతిక ప్రయాణంలో   అతిపెద్ద రక్షణ కవచం,  రహస్య ఆయుధంగా  మారింది. 

By
en-us Political News

  
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్‌పల్లి మంజీరా మాల్‌లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్‌వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.