కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు?

Publish Date:Jan 10, 2025

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. గురువారం (జనవరి 9) దాదాపు ఏడుగంటల పాటు ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయన పూర్తిగా ఇరుక్కున్నారని అర్ధమౌతోందని అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు గురువారం (జనవరి 9) సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణ ముగిసి ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు తనను 85 ప్రశ్నలు అడిగారనీ చెబుతూ, అవన్నీ రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలే అంటూ చెప్పుకొచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసు ఓ లొట్టపీసు కేసనీ, రేవంత్ రెడ్డి ఓ  లొట్టపీసు సీఎం అంటూ వ్యాఖ్యానించారు. 

పదేళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. అయినా ఇప్పుడు విపక్షంలో ఉండి ఆయన కనీస సంయమనం లేకుండా మాట్లాడారు. నడి రోడ్డుపై మీడియాతో మాట్లాడారు. అందుకు అభ్యంతరం చెప్పిన పోలీసులపై విరుచుకుప్పడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రోడ్డుపై ప్రెస్ మీట్లకే కాదు.. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో కూడా సభలూ, సమావేశాలకు అనుమతి లేదన్న సంగతి ఆయన ఇప్పుడు కన్వీనియెంట్ గా మర్చిపోయారు. నడిరోడ్డుపై సమావేశాలు జనాలకు ఇబ్బంది అన్న కనీస స్ఫృహ కూడా లేకుండా ఆయన వ్యవహరించారని అంటున్నారు.

ఈ ఫార్ములా కార్ కేసులో కేసులో నిధుల బదలాయింపు జరిగిందనీ, అందుకు తానే ఆదేశాలిచ్చాననీ చెబుతూ కూడా తప్పు జరగలేదని దబాయించడానికే ప్రయత్నించారు. నిబంధనలను తుంగలో తొక్కి ఆదేశాలిచ్చి.. వాటిని అమలు చేసిన అధికారులదే తప్పు అంటూ తప్పించుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆయన మీడియా సమావేశం తరువాత పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏసీబీ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరై ఆ ఉక్రోషాన్ని పోలీసులపై ప్రదర్శించినట్లు కనిపిస్తోందంటున్నారు.  విచారణలో ఏసీబీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేయటంతో ఆ కోపాన్ని మీడియా సమావేశంలో కేటీఆర్ బయటున్న పోలీసులపైన చూపారని అర్ధమవుతోంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ కేసులో నిబంధనల ఉల్లంఘన  జరిగిందని అంగీకరించలేక, జరగలేదని గట్టిగా చెప్పలేక కేటీఆర్ ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు విదేశీకంపెనీకి నిధులు ఎలా బదిలీచేస్తారన్న ప్రశ్నకు కేటీఆర్ ఆ విషయం అధికారులకు సంబంధించిందని తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అలాగే  ఒప్పందం నుండి తప్పుకున్న కంపెనీపై లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకూ ఆయన నేరుగా బదులివ్వలేదని తెలుస్తోంది. ఎంత సేపూ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు తాను ప్రయత్నించానని చెప్పుకున్నారని అంటున్నారు.  నిధుల బదలాయింపునకు క్యాబినెట్ అనుమతి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకూ ఆయన సరైన బదులు ఇవ్వలేదంటున్నారు.    

విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సరైన సమాధానాలు ఇవ్వలేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. ఆయన విచారణకు సహకరించలేదనీ, అందుకే మరోసారి విచారణకు పిలుస్తామని చెబుతున్నారు. ఇదే విషయాన్ని వారు కేటీఆర్ కు కూడా చెప్పినట్లు సమాచారం.  సంక్రాంతి తరువాత ఏదో ఒక రోజు కేటీఆర్ ను ఏసీబీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.  

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.