పేర్ని నానిలో పీక్స్ లో ఫస్ట్రేషన్

Publish Date:May 10, 2022

Advertisement

పేర్ని నాని.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ఏమో కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లో మంత్రిగా ఈ పేర్ని నాని గారి హావా కొట్టొచ్చనట్లు కనబడేదని.. ఫ్యాన్ పార్టీలోని నాయకులు ఏమో కానీ.. సినీ పెద్దలు మాత్రం టాలీవుడ్ సాక్షిగా గట్టిగానే చెప్పుకొనేవారు. అయితే పేర్ని నాని తాజాగా మాజీ మంత్రిగా మారారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ట్రేటషన్ పీక్స్ వెళ్లిపోయిందనే ఓ టాక్ అయితే బందరు నియోజకవర్గంలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది.

మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఈ మాజీ మంత్రిగారిని తాజాగా నగర ప్రజలు అంతాగా లెక్క చేయడం లేదట. ఈయన గారు నగర వీధుల్లోకి వస్తే.. జనం లైట్‌గా తీసుకుని చూసి చూడనట్లు పక్క నుంచి వెళ్లిపోతున్నారట. అంతేకాదు.. ఇటీవల కేంద్ర మంత్రి పోర్టు అంశంపై.. బందరు వస్తే.. రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజుతో ఆయన మాట్లాడుతుండగా.. ఈ మాజీ మంత్రిగారు.. అల్లంత దూరంలో ఉండిపోయిన ఓ చిత్ర రాజం ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. 

మరోవైపు.. బందరు నగరంలో జనసమర్దంగా ఉండే ఓ ప్రాంతంలో ఇటీవల ఓ షాపును.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు.  కానీ ఈ కార్యక్రమానికీ ఈ తాజాగా మాజీ అయిన మంత్రిగారిని పిలవలేదట. దీంతో ఈ మాజీ అమాత్యుల వారికి కోపం నషాళానికి అంటిందట. అంతే.. ఈ మాజీ సార్ వాడు.. వెంటనే రంగంలోకి దిగి.. సదరు కూడలిలో బారికెడ్లు పెట్టించారట. దీంతో సెంటర్‌లో ఈ బారికెడ్లు ఎందుకు రోడ్డుకు అడ్డంగా ప్రత్యక్షం అయినాయో.. అర్థం కాక.. సదరు నగర వాసులు అయోమయం జగన్నాథం స్థితిలోకి సర్రున జారిపోయారట. అసలు ఏం జరిగిందంటూ అక్కడి వారిని జనం ఆరా తీయగా.. ఇదంతా మాజీ మంత్రివర్యులు గారి తాజా తాజా పెతాపం అంటూ గుసగుసలు మొదలైనాయట. 

జగన్ కేబినెట్‌లో పేర్ని నాని...  రవాణా, సినీమాటోగ్రఫీ, సమాచారం పౌర సంబంధాలు శాఖల మంత్రిగా పని చేసినా.. సినీమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ధగధగా వెలిగిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గతంలో మంత్రిగా పేర్ని నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా..చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై ఓ రెంజ్‌లో చెలరేగిపోయేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. మరో వైపు జగన్ కేబినెట్‌ నుంచి తప్పుకుని మాజీ మంత్రులు అయిన కొడాలి నాని, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, అవంతి తదితరులంతా ముక్కున వేలేసుకుని స్కూల్ స్టూడెంట్‌లా సైలెంట్ అయిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఈ పేర్ని నాని మాత్రం ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నట్లు వ్యవహరిస్తున్నారని ఓ టాక్ అయితే నియోజకవర్గ ప్రజలు బలంగా ఉంది. 

అంతేకాదు తాజాగా మాజీలు అయిన మంత్రులు కొడాలి, కన్నబాబు, అవంతి, అనిల్ కుమార్ యాదవులు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. కానీ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. మంత్రిగారి హోదాలో మాట్లాడినట్లు మాట్లాడడం. జనానికి అంతగా రుచించడం లేదట. మరోవైపు వంగవీటి రాధ, కొడాలి నానిలు మంచి దోస్తులే. కానీ వంగవీటి రాధకు పేర్ని నానికి మద్య గ్యాప్ ఉందని సమాచారం. ఆ క్రమంలోనే వంగవీటి రాధ.. తన నియోజకవర్గంలోకి వచ్చి.. షాపు ఒపెనింగ్ చేసి వెళ్లిపోవడాన్ని ఈ మాజీ మంత్రి వర్యులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఏదీ ఏమైనా మాజీలు అయిన సహచరులంతా చాలా కామ్‌గా ఉంటే.. ఈ పేర్ని నాని మాత్రం ఇలా రగిలిపోవడం ఎందుకు అని ప్రశ్న బందరులోని  ఫ్యాన్ పార్టీ నేతల్లోని ఓ వర్గంలో ఉత్పన్నమైందట. అదీ ప్రస్ట్రేషనా లేక మళ్లీ మంత్రి పదవి కోసమేనా? అనే సందిగ్థంలోకి ఆయన అనుచరులంతా లట్టుక్కున జారీపోయారట.

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.