ఇండియా నరకకూపం అన్న వారాల వ్యవధిలోనే.. మాట మార్చిన ట్రంప్

Publish Date:May 25, 2026

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోటి నుండి  ఏ నిముషానికి ఏ మాట వస్తుందో ఎవరూ ఊహించలేరు.  కేవలం కొన్ని వారాల కిందట  అమెరికాను దోపిడీ చేయడానికి ఇండియా తన పౌరులను ఎగుమతి చేస్తున్నదన్న డోనాల్డ్ ట్రంప్.. ఇండియాను ఒక నరకకూపంగా అభివర్ణించారు. అదే నోటితో తాజాగా ఆయన ఇండియా అమెరికాకు గొప్ప మిత్రదేశమని, తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బిగ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.  అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన సందర్భంగా..  ప్రత్యక్ష ప్రసారంలో వర్చువల్‌గా కనిపించిన డొనాల్డ్ ట్రంప్, తాను ఇండియాను  ప్రేమిస్తున్నాన్నారు. అందరికీ   అందరికీ హలో చెప్పాలనుకుంటున్నాననీ, తాను ప్రధాని మోడీకి బిగ్ ఫ్యాన్ ననీ చెబుతూ.. ప్రధాని మోడీని ఒక గొప్ప వ్యక్తిగా, తనకు అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్ గా పేర్కొన్నారు.  గతంలో ఎన్నడూ అమెరికా ఇండియాకు ఇంత సన్నిహితంగా లేదన్న ట్రంప్.. ఇండియా అమెరికాపై వంద శాతం ఆధారపడవచ్చనీ,   వారికి ఏదైనా సహాయం అవసరమైతే,  ఒక్క ఫోన్ కాల్ చాలు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు.  ఇండియా  అమెరికాకు   మిత్రదేశమనీ, కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం భరోసా ఇచ్చే ప్రకటన కావచ్చునేమో కానీ, పాలనా చర్యల విషయానికి వస్తే, అమెరికా భారత జనాభాకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని భారత జనాభా భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించే ఇటీవలి ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.     
వాస్తవానికి, అంతర్జాతీయ దౌత్య వేదికలపై ట్రంప్ భారతదేశంతో  హాట్ అండ్ కోల్డ్ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకవైపు భారత వస్తువులపై భారీగా పన్నులు   విధిస్తూ, కఠినమైన వాణిజ్య నిబంధనలను అమలు చేస్తూనే.. మరోవైపు ప్రధాని మోదీని పబ్లిక్ వేదికలపై ఆకాశానికెత్తేయడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. గతంలోనూ రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నాయి. అయినప్పటికీ, వాణిజ్య ఒప్పందాల విషయంలో మోదీతో కలిసి పని చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని ట్రంప్  సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.

ఒకవైపు అధ్యక్షుడు ట్రంప్ దేశాధినేతల స్థాయిలో భారత్‌తో మైత్రి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అమెరికా యంత్రాంగం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం భారతీయ పౌరులకు  ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నూతన వలస నిబంధనల ఉత్తర్వులు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, వారు తిరిగి తమ స్వదేశానికి  వెళ్లి అక్కడి నుంచే ఫైల్ చేయాలని నూతన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో స్థిరపడాలనుకునే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రాజకీయంగా, దౌత్యపరంగా ట్రంప్ ప్రకటనలు భారత్‌కు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ..  అమెరికా అంతర్గత విధానాలు మరియు వాణిజ్య ఆంక్షలు మాత్రం భారతదేశ ప్రయోజనాలకు భిన్నంగా సాగుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. ట్రంప్ మాటల్లోని సాన్నిహిత్యం చేతల్లో కూడా కనిపిస్తేనే ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని అంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యం భారత్‌కు వంద శాతం అండగా ఉంటామని, ఒక్క ఫోన్ కాల్‌తో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అంతర్జాతీయంగా భారతదేశ వ్యూహాత్మక బలాన్ని చెప్పకనే చెబుతోంది. 

రాబోయే రోజుల్లో ట్రంప్ చేసిన ఈ సానుకూల వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి,  వీసా నిబంధనలను సరళీకరించడానికి ఎంతవరకు దోహదపడతాయన్నది చూడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడి తాజా యూ-టర్న్ ప్రకటనతో భారత్-అమెరికా రక్షణ, ఆర్థిక భాగస్వామ్యం సరికొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

By
en-us Political News

  
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.