ట్రబుల్ షూటర్ నుంచి సీఎం వరకూ.. డీకే ప్రస్థానం

Publish Date:May 28, 2026

Advertisement

కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. కాంగ్రెస్ విశ్వాసపాత్రుడు, ఆపద్బాంధవుడుగా నిలిచిన డీకే శివకుమార్ రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అందుకోనున్నారు. ప్రత్యర్థులకు  కనకపుర బండ, సొంత పార్టీకి  ట్రబుల్ షూటర్’గా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. 
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు  ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు.  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.  

ఇక డీకే ప్రస్థానం ఎలా సాగిందన్నది చూస్తే.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో  డీకే శివకుమార్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.  80వ దశకంలో ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా  ప్రారంభించిన ఆయన..  1989లో తొలిసారి  శాసనసభకు  ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రాజకీయాల్లో  అపజయం ఎరుగని నేత   తిరుగులేని పట్టు సాధించారు. 

ఒక్క కర్నాటక అనే కాదు.. దేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. ఆ కష్టం తీర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ డీకే శివకుమార్ వైపే చూసేది.   రిసార్ట్ రాజకీయాలైనా, ఎమ్మెల్యేలను కాపాడుకోవడమైనా ఆయన వ్యూహాలకు తిరుగుండేది కాదు. అందుకే ఆయనను పార్టీ   ట్రబుల్ షూటర్ గా భావించేది.

డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఆయనను అరెస్ట్ చేసి  50 రోజుల పాటు తిహార్ జైలులో ఉంచింది. ఆ అరెస్టుపై డీకే శివకుమార్ పలు సందర్భాలలో  తనకు రెండు దారులు చూపారనీ, వాటిలో ఒకటి బీజేపీలో చేరడం రెండో ది  జైలుకు వెళ్లడం.  అయితే తాను రెండో దారినే ఎంచుకున్నాననే ఆయన.. , జైలుకే వెళ్లాను కానీ పార్టీ మారలేదుచెప్పుకొచ్చారు.  ఆయన జైలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా తిహార్ జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించడం అప్పట్లో దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. 

జైలు నుంచి విడుదలైన తర్వాత మరింత పట్టుదలగా పనిచేసిన శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని  అధికారంలోకి తీసుకురావడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు.  సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ ప్రకటించిన  ఐదు గ్యారెంటీల అమలులో  అత్యంత కీలకంగా వ్యవహరించారు.  

గతంలో ఆయన ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద   పావగడ సోలార్ పార్క్' రూపుదిద్దుకుంది. ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శనంగా చెబుతారు పరిశీలకులు.  ఈడీ కేసులు, జైలు జీవితం, రాజకీయ వ్యూహాలు, సుదీర్ఘ నిరీక్షణల తర్వాత డీకే శివకుమార్  ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల తరువాత కర్నాటక సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తన కలల పీఠాన్ని అధిరోహిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు,  కార్యకర్తల  అండతో    రానున్న రోజులలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో  మరో సారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని డీకే శివకుమార్ చెబుతున్నారు. 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.