Publish Date:Jul 28, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఒకటి.దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన తరువాత ఈ పథకం అమలుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకాన్ని తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై ఆయా రాష్ట్రాలలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
దీంతో అన్ని రకాలుగా ఆలోచించి చివరకు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఏ జిల్లా వారికి ఆ జిల్లాలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి జిల్లాల పరిమితులేమీ లేవనీ, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చనీ అచ్చెన్నాయుడు చెప్పారు. ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఆయనీ విషయం తెలిపారు.
ఏపీలో మహిళలకు ఎగిరి గంతేసే వార్త. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పథకానికి జిల్లాల పరిమితులు లేవనీ . రాష్ట్రమంతటా అమలు చేస్తామని తెలిపారు. ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ప్రత్తిపాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఆటో డ్రైవర్ల ఉపాధిపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. తొలుత జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ.. ఆ తరువాత మంత్రి నారా లోకేష్ జోక్యంతో దీనిపై విస్తృతంగా చర్చింది, జిల్లాల పరిమితి వద్దని నిర్ణయించినట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/free-bus-travel-for-women-in-apsrtc-39-202936.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.