అందరికీ ఉచితంగా బూస్టర్ డోసు .. ఆజాదీకా కానుక
Publish Date:Jul 13, 2022
Advertisement
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' పేరుతో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగగాగా 75 రోజుల పాటు దేశ ప్రజాలందరికీ, కొవిడ్ వాక్సిన్ మూడవ డోసు (బూస్టర్ ) ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 60ఎళ్ల పైబడిన వారికీ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు మాత్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దీంతో, ఈవయస్సు వారిలో రెండు కేవలం ఒక శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో, మహమ్మారి మరో మారు విజృంభించక ముందే సాధ్యమైనంత ఎక్కువ మందికి బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభమవుతుంది ఇందులో భాగంగా 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేస్తారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటోన్న ఆజాదీకా అమృత్ మహాత్సవ్ లో భాగంగా ప్రికాషన్ డోసు పంపిణీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి. దేశం మొత్తంలో మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే, రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి, ఐసీఎంఆర్ తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో బూస్టర్ డోసు ఇవ్వడం వల్ల రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని శాస్త్ర వేత్తలు చేసిన సూచన ఆధారంగా 18ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రత్యేక కార్యక్రమం ద్వారా బూస్టర్ డోసును ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. జులై 15 నుంచి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం, దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96 శాతం మంది ఒకడోసు తీసుకోగా.. 87శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ప్రికాషన్ డోసుగా పిలుస్తోన్న మూడో డోసును మాత్రం 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేటు కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నారు. దేశంలో 77 కోట్ల మంది ఈ వయసు వారు ఉండగా అందులో కేవలం ఒకశాతం మాత్రమే ఇప్పటివరకు ప్రికాషన్ డోసును తీసుకున్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16 కోట్లు ఉండగా వారిలో 26శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో వైపు కరోనా వ్యాక్సిన్ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించింది. దీంతో రెండో డోసు తీసుకొని ఆరు నెలలు పూర్తైన వారు మూడో డోసును తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/free-boster-doose-to-all-centers-azadi-ka-gift-25-139671.html





