ఆస్ట్రేలియా పౌరసత్వం... తెలంగాణలో లిక్కర్ స్కామ్!
Publish Date:Feb 25, 2026
Advertisement
హైదరాబాద్‌లో మరో బిగ్ బిజినెస్ గురు అసలు రూపం బయటపడింది. లిక్కర్ తయారీ కేంద్రాలు పెడతాను, పబ్బులు తెరిపిస్తా, లైసెన్సులు ఇప్పిస్తానంటూ వ్యాపారు లకు కలల కోటలు చూపించి కోట్ల రూపాయలు గుంజేసిన అక్కల రామకృష్ణ ప్రసాద్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన కథ, చివరకు లోకల్ లాక్‌ప్ కు చేరింది. దీంతో మోసపోయిన నరేందర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు అక్కల రామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేశారు. నిందితుడు పారిపోవాలని ప్లాన్ చేసినా… పోలీసుల ఎల్ఓసి ముందే వచ్చింది. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లేలోపే బోర్డింగ్ పాస్ కు బదులు అరెస్ట్ మెమో చేతికి అందించిన పోలీసులు అక్కల రామకృష్ణ ప్రసాద్ ను అరెస్టు చేశారు. ఇలా పోలీసుల చేతికి చిక్కిన రామకృష్ణ చెప్పిన కథలు మాత్రం సినిమా స్టోరీలకు ఏమాత్రం తక్కువ కావు. సొంత ల్యాండ్ కొన్నానని…ఫ్లాట్ రెడీ అవుతోందని…సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లో పెట్టుబడులు పెడితే డబ్బుల వర్షం కురు స్తుందని…మాయమాటలు చెప్పి వ్యాపారులను నమ్మించాడు. అది నిజమని నమ్మిన వ్యాపారులు పెట్టుబడులు పెట్టగా, లాభాలు కాకుండా వారి లాకర్ ఖాళీ అయినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.. అయితే నిందితుడు ఆస్ట్రేలియాలో కూడా ఇదే స్క్రిప్ట్ నడిపి చీటింగ్ కేసుల్లో జైలు జీవితం గడిపిన అనుభవం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరి మళ్లీ మోసాలకు పాల్పడు తున్నట్లు దర్యాప్తులో తేలింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.4 కోట్ల రుణం కూడా తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టినట్లు సమాచారం. విలాసవంతమైన జీవితం కోసం వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేయడం ఇతని స్టైల్ అని పోలీసుల విచారణలో బయటపడింది.ఇక నిందితుడి తండ్రి వరప్రసాద్, సహచరుడు విక్రమ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. రామకృష్ణ చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సీసీఎస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.మొత్తానికి నిందితుడి కథ లిక్కర్ ఫ్యాక్టరీ పేరుతో మొదలైన బిజినెస్, పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ తో ముగిసింది.
బేవరేజ్ ఫ్యాక్టరీ పెడదాం… మనదే మార్కెట్ అంటూ వ్యాపారి నరేందర్ ను నమ్మించి అతని వద్ద నుంచి విడతల వారీగా రూ.1.30 కోట్లు వసూలు చేసిన రామకృష్ణ, ఫ్యాక్టరీ మాత్రం కలలో కూడా కనిపించనివ్వ కుండా మాయమయ్యాడు.
http://www.teluguone.com/news/content/fraudster-akkala-ramakrishna-prasad-arrest-36-214644.html





