Publish Date:Jul 22, 2025
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు టెస్టుల సిరీస్‌లో ఇండియాని అదృష్టం వెక్కిరిస్తోంది. భారత్ యువ జట్టు ఇంగ్లాండ్ టూర్ లో మంచి ఆటతీరు ప్రదర్శిస్తున్నప్పటికీ లక్ మాత్రం కలిసి రావడం లేదు. కాస్త అదృష్టం తోడైతే భారత్ ఇప్పిటికే 3-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్ కైవసం చేసుకునేదని క్రీడా పండితులు అంటున్నారు. అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో మంచి ప్రదర్శన చేసిన భారత్ కీలక సమయాల్లో పట్టు నిలబెట్టుకోలేక రెండు మ్యాచ్‌లను చేజార్చుకుని 1-2తో వెనుకబడి ఉంది. లార్డ్స్‌లో చివరి వరకు పోరాడి ఓడిన టీమ్ ఇండియా ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టుకు రెడీ అవుతోంది. ఆతిథ్య జట్టుతో బుధవారం (జులై 23) మాంఛెస్టర్ లో కీలక నాలుగో టెస్టులో తలపడనుంది.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఇందులో ఓడితే టీమ్ ఇండియా సిరీస్ ఆశలు ఆవిరవుతాయి. ఇలాంటి తరుణంలో భారత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో 9 టెస్టుల్లో భారత్ 4 మ్యాచుల్లో ఓడిపోయింది. అయిదు డ్రాగా ముగించగలిగింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా విజయంసాధించిన చరిత్ర లేదు. చివరిగా 2014లో ఆడిన టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ సిరీస్‌కు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లోనూ టీమ్ ఇండియాకు విజయం దక్కలేదు. అయితే ఈ సిరీస్‌లో భారత్ అక్కడ అద్భుత విజయం సాధించింది. దాంతో గత రికార్డులను పట్టించుకోకుండా ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌ని భారత్ స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉందంటున్నారు.
ఇప్పటి వరకు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని యువ క్రికెటర్లకు సూచిస్తున్నారు టీమ్ ఇండియా సీనియర్లు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ కవ్వింపులకు నోటితో సమాధానం చెప్తూనే ఆటతో వాళ్ల నోళ్లు మూయించాలంటున్నారు. అప్పుడే మాంచెస్టర్‌లో టీమ్ ఇండియా తొలి విజయం నమోదు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేయగలుగుతుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ టీమ్ ఇండియా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fourth-test-with-england-39-202466.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.