వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాద ఘటన గుంటూరులో జరిగింది. గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఆదివారం ఓ వీధి కుక్క నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కి తరలించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. వీధికుక్కల నియంత్రణలో అధికారుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీధికుక్కల స్వైర విహారంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదేని స్థానికులు విమర్శిస్తున్నారు. తాజా ఘటనలో ఆదివారం (ఏప్రిల్6) సాయంత్రం నాలుగు గంటల సమయంలో చర్చి నుంచి బయటకు వచ్చిన ఐజాక్ అనే బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఐజాక్ ఆస్పత్రిలో మరణించడంలో స్వర్ణ భారతి నగర్ లో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. నాగరాజు, రాణిమెర్సి దంపతుల మూడో సంతామైన ఐజాక్.. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్లాడు. మూత్ర విసర్జన కోసం చర్చి బయటకు వచ్చిన ఐజాక్ పై ఓ వీధికుక్క దాడి చేసింది. బాలుడి మెడ పట్టుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లి వదిలేసింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఐజాక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటన అనంతరం ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఇలాంటి దారుణం మరెక్కడా, ఎవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తక్షణం స్పెషల్ డ్రైవ్ చేపడతామని మునిసిపల్ అధికారులు అంటున్నారు. బాలుడి మృతి పట్ల మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-tear-kid-died-in-stray-dog-attack-39-195728.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.