ఏపీలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు.. ట్రాఫిక్ సమస్యలు ఇక మటుమాయం!

Publish Date:Oct 24, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, అలాగే ప్రధాన నగరాలతో కనెక్టివిటీ పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. దాదాాపు 45 వేల 300 కోట్ల వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ లక్ష్యంగా వీటి నిర్మాణం ఉంటుందన్నారు. ముందుగా హైదరాబాద్ మచిలీపట్నంను కనెక్ట్ చేసేలా 18 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తామన్నారు.  
జగన్ అరాచకపాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ అధ్వానంగా మారాయన్నారు. రోడ్డు, రవాణా వ్యవస్థ కూడా నాశనమైందన్నారు. ఇక జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్‌ప్లాజా సమస్యలు ఉన్నాయని వివరించారు. మరో ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని చెప్పిన ఆయన వీటన్నిటినీ మూడు నెలల వ్యవధిలో సరిచేస్తామని చెప్పారు. 

అదే విధంగా  లాజిస్టిక్ హబ్ గా ఏపీ మారనుందన్న ఆయన ఏపీకి మరో మూడు పోర్టులు రానున్నాయన్నారు. అక్వా, హార్టీ కల్చర్ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  మరింత మెరుగ్గా, ఎఫెక్టివ్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారు. అధికారులు ఆ దిశగా మరింత వేగంగా చురుకుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.   జగన్ హయాంలో విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారుస్తున్నామన్నారు.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.