భోపాల్ గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు.. నేర్చుకున్న పాఠాలేంటి?

Publish Date:Dec 4, 2024

Advertisement

భోపాల్  గ్యాస్ ట్రాజిడీకి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యింది. ఆ విషాదం నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటికి రెడ్ కార్పెట్ పరుస్తు.. పర్యావరణం, ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలకు తిలోదకాలిచ్చేస్తున్నాయి.  ముఖ్యంగా ఏమైనా విపత్తులు సంభవిస్తే సదరు కంపెనీలే పూర్తి బాధ్యత వహించాలన్న దిశగా ఇప్పటికీ చట్టాలు లేకపోవడం దారుణం.  1884 డిసెంబర్ 3వ  భోపాల్లో  యూనియన్ కార్బైడ్  ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసనియేట్ వాయువు లీకైంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న  చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. నిద్రలోనే ఈ విషవాయువు ను పీల్చడంతో కళ్లు విపరీతంగా మండడంతో ఇళ్లు నుంచి బయటకు వచ్చారు.ఊపిరి తిత్తులలోకి ఈ వాయువు వెళ్ళడంతో ఆస్పత్రులకు పరిగెత్తారు. మధ్యలోనే రోడ్లపై ప్రాణాలు వదిలారు. తెల్లవారేసరికి నగరంలో ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించాయి. విషవాయువు పీల్చి మరణించిన వారి సంఖ్య  పాతిక వేలకు పైనే ఉంటుదన్నది ఒక అంచనా, మృతులే కాకుండా మరో ఆరు లక్షల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఇప్పటికీ వారిని ఆ పీడ వదలలేదు. అప్పుడు గర్భవతులు గా ఉన్న తల్లులు కన్న పిల్లలు ఇప్పటికీ అంతుపట్టని వ్యాధులతో బాధపడుతున్నారు. వారి తరువాత తరాల వారు కూడా అనేక రోగాలతో బాధపడుతునే ఉన్నారు.
అత్యంత దారుణమేమంటే ప్రమాదం జరిగిన వెంటనే 6వతేదీ అమెరికా నుంచి ఆ కంపెనీ చైర్మన్ వారెన్ అండర్సన్ భోపాల్ వచ్చారు.ఆయనను పోలీసులు అరెస్టు చేసి కంపెనీ అతిధి గృహంలో బంధించారు. కేవలం మూడు వేల మంది చనిపోయారని,1.2లక్షల మంది అస్వస్థతకు గురైనారని అంచనా వేసి1989లో నష్టం పరిహారం 47కోట్ల డాలర్లతో భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అప్పటివరకూ ఈ  గ్యాస్ వల్ల వచ్చే దుష్పరిణామాలు కంపెనీ సరిగా వెల్లడించలేదు. అ  అండర్సన్ వెంటనే  స్వదేశానికి తిరిగి వెళ్లేలా  అమెరికా ప్రభుత్వం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీపై ఒత్తిడి తీసుకువచింది. దీంతో   కేవలం నామమాత్రపు పూచికత్తుపై బెయిల్ తీసుకుని అండర్సన్  విమానంలో అమెరికా వెళ్లిపోయాడు.పరిహారం నామమాత్రమే పుట్టడంతో బాధితులు కోర్టులు,అంతర్జాతీయ సంస్థలు చుట్టూ తిరిగినా ప్రయోజనం కలగలేదు. అండర్సన్ భారత్ వైపు తిరిగి చూడలేదు. కంపెనీ నష్టపరిహారం ఒప్పందం మించి ఒక్క రూపాయి ఇవ్వలేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి.  ఆ కర్మాగారం మూతపడినా చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి. నిజానికి మిథైల్ ఐసోసనియేట్ వాయువు సైనేడ్ అంత ప్రమాదమని అనంతర పరిశోధనలలో తేలింది.ఈ ప్రమాదం అనంతరం జన్మించిన అనేక మంది పిల్లలు వికలాంగులుగా పుట్టారు.శిశు మరణాల రేటు భోపాల్ లో ఇప్పటికీ అధికంగానే ఉంది. మూడు తరాలు మారినా అనారోగ్య సమస్యలు వెంటాడుతునే ఉన్నాయి.నేటికీ న్యాయంకోసం ప్రధాని మోడీకి కన్నీళ్లతో విజ్ఞాపనలు పంపేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు.

ఒక్క కంపెనీ నిర్లక్షమే ఇంతటి వినాశనం సృష్టిస్తే భారత్ కు కుప్పలుతెప్పలుగా వస్తున్న కంపెనీలు ఎంతవరకూ క్షేమదాయకమో ఊహించలేం.ఉన్న స్వదేశీ కంపెనీలే విషాన్ని కక్కుతుంటే కాలుష్య నియంత్రణ అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికీ మందుల తయారీ కంపెనీలు హైదరాబాద్ లాంటి నగరాల్లో నిషిద్ధ వాయువులను గాలిలోకి వదులుతున్నాయి. అయినా అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు.అదే విదేశీ కంపెనీల విషయంలో కఠినంగా ఉంటారా అనేది అనుమానమే. అలాంటి పరిస్థితి రాకుండా కాలుష్య నియంత్రణపై తగిన చర్యలు చేపట్టేలా అధికారులు,ప్రభుత్వాలు తగిన ఒప్పందాలు చేసుకునేలా చట్టాలు రావలసిన అవసరం ఉంది.  

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.