ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గురువారం నాడు అత్యంత ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. కంటిపాపల్లా చూసుకోవాల్సిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి గల్లంతైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒంగోలు మండలం పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. అప్పటివరకు కళ్లముందే తిరుగుతూ, సందడి చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపిన నలుగురు పిల్లలు ఒక్కసారిగా కనుమరుగైపోవడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ఆక్రందనలతో ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరవుతోంది. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, గ్రామానికి చెందిన కరేటి సుశాంత్ (12 సంవత్సరాలు), కరేటి అభిరామ్ (14 సంవత్సరాలు) లతో పాటు చిన్నూ, దినేష్ అనే నలుగురు చిన్నారులు మధ్యాహ్నం సమయంలో ఆడుకోవడానికి బయటకు వెళ్లారు.
వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటం, పైగా గ్రామానికి సమీపంలోనే నీటికుంట ఉండటంతో సరదాగా స్నానం చేద్దామని ఆ చిన్నారులు భావించారు. ఈ క్రమంలోనే వారు చెరువుకొమ్ముపాలెం గ్రామ పరిధిలోని నీటికుంట వద్దకు చేరుకున్నారు. తాము దిగుతున్న నీటికుంట ఎంత లోతు ఉందో, అందులో ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో తెలియని ఆ అమాయక చిన్నారులు ఒకరి వెనుక ఒకరు నీటిలోకి దిగారు. దురదృష్టవశాత్తు ఆ నీటికుంటలో లోతు ఎక్కువగా ఉండటంతోపాటు, అడుగున పేరుకుపోయిన బురద కారణంగా వారు ఒకరినొకరు కాపాడుకోలేక నీట మునిగిపోయారు. లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు నలుగురూ ఒకేసారి నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు.
పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానిక నీటికుంట ఒడ్డున పిల్లలకు సంబంధించిన బట్టలు, చెప్పులు ఒడ్డున విడిచిపెట్టి ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పిల్లలు నీటిలోనే మునిగిపోయి ఉంటారని గ్రహించిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అత్యవసర సహాయక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ హృదయవిదారక సమాచారం తెలుసుకున్న ఒంగోలు పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే రంగంలోకి దిగి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నీటికుంట లోతు ఎక్కువగా ఉండటంతో స్థానిక గజఈతగాళ్లను రప్పించి అత్యంత వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లు నీటికుంటలోకి దిగి గల్లంతైన నలుగురు చిన్నారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా, గల్లంతైన చిన్నారులంతా చెరుకుంపాలెం మరియు చెరువుకొమ్ముపాలెం గ్రామస్థులుగా అధికారులు గుర్తించారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారేమోనని నీటికుంట ఒడ్డున తల్లిదండ్రులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేస్తోంది. ప్రమాద స్థలం వద్దకు వందలాదిగా గ్రామస్థులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త మరియు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-children-missing-after-falling-into-a-puddle-36-221836.html
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్‌పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.