Publish Date:Mar 18, 2026
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గురజాల కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గత 98 రోజులుగా నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నాడు.
ఈ కేసులో పిన్నెల్లి తరఫు న్యాయవాదులు సమర్పించిన వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పిన్నెల్లి త్వరలోనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం పల్నాడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది. ఒకే కేసులో ఇద్దరు సోదరులకు భిన్నమైన తీర్పులు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తదుపరి విచారణల నేపథ్యంలో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-ysrcp-mla-pinnelli-granted-bail-36-215735.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.