పరారీలో వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని.!?

Publish Date:Jul 20, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నారు. కుటుంబంతో సహా సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు కారులో తన ఇంటి నుంచి కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.  శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన  4 కోట్ల రూపాయల విలువైన   భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో..  అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  

  తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి,  కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌లపై  భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ్మినేని కుటుంబం ఆముదాల వలసలో తాము ఉంటున్న నివాసం నుంచి పరారైపోయారు.  స్వంత వాహనాలు నివాసం వద్దే వదిలేసి, తమ కదలికలను మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేసే అవకాశం లేకుండా ఫోన్లు కూడా ఇంట్లోనే వదిలేసి ఓ  ప్రైవేటు కారులో వెళ్లిపోయారు.   

తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారు కావడానికి కారణమైన  భూకబ్జా వ్యవహారం వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం చాపురం పంచాయతీ పరిధిలోని బలగ ప్రాంతంలో ఉన్న  స్థలానికి సంబంధించిన అసలు యజమాని   బతికే ఉన్నప్పటికీ..  ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక మహిళను ఆ ఆస్తికి ఏకైక చట్టబద్ధమైన వారసురాలిగా చూపిస్తూ, సదరు భూమిని తమ్మినేని సీతారాం కుమారుడి పేరిట   రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై ఆధారాలు  సేకరించిన పోలీసులు, దీని వెనుక ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ నెట్‌వర్క్ నెరిపిన దందాను బహిర్గతం చేశారు.

ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల కుట్రలో భాగస్వాములైన 13 మంది నిందితులలో హిరమండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ప్రధాన నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం ఆయన కుటుంబం తమ నివాసంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ, పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేయడంలో కాలయాపన చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.    ఈ ఆలస్యాన్ని ఆసరాగా చేసుకుని, తమ్మినేని కుటుంబం చట్టపరమైన న్యాయ సలహాలు స్వీకరించి, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రే పరారయ్యారని తెలుస్తోంది.  

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,  ఆయన కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమదాలవలసలోని టీఎస్ఆర్ కాలేజీ పక్కన ఉన్న 8 సెంట్ల   ఆస్తిని ఆక్రమించారనే ఆరోపణలు రాగా, ఇటీవలె రెవెన్యూ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని బాధితులకు తిరిగి అప్పగించారు. వీటితో పాటు, టెక్కలి మండలం చింతామణి గ్రామంలోని 23 ఎకరాల భూమిని బెదిరించి తన కుమారుడి పేరిట రాయించుకున్నారని, అలాగే ఒక మృతుడి కుటుంబానికి చెందిన ఇంటిని  ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

అదలా ఉంటే తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీ అయిన నేపథ్యంలో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తమ్మినేని సీతారాం కుటుబంతో సహా  పొరుగు రాష్ట్రాలకు వెళ్లి  ఉంటారనే అనుమానంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలకి దింపి  సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనం ప్రయాణించిన మార్గాలను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. 

Srikakulam Land Grab Case, YCP Senior Leader, Fake Registration Scam, AP Police Investigation

By
en-us Political News

  
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
జూలై 31 ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తోంది. దాదాపు 3 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైన వేళ, డెడ్‌లైన్ మిస్ అయితే రూ. 5,000 వరకు పడే లేట్ ఫీజులు, సెక్షన్ 234A వడ్డీ, మరియు ఇతర నష్టాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి.
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ రీప్లే చేయాలంటూ అర్జెంటీనా అభిమానులు ఛేంజ్ డాట్ ఆర్గ్‌లో పిటిషన్ ప్రారంభించారు. ఇప్పటికే 61,500 మందికి పైగా సంతకాలు చేసిన ఈ వివాదంలో ఫిఫా నిబంధనలు ఏం చెబుతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తండ్రి తన తండ్రి నుంచి పొందిన ఆస్తిపై పిల్లలకు పుట్టుకతోనే హక్కు ఉంటుందా స్వయంకార్జిత ఆస్తులు, పిత్రార్జిత ఆస్తుల మధ్య తేడాలను వివరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ ఇంజనీర్ FDE ఉద్యోగాల డిమాండ్, రూ. 1.4 కోట్ల భారీ జీతాల ప్యాకేజీలు మరియు AI అమలులో వీటి ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
126 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా ఆరంభంలోనే ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఆ ఆనందం జింబాబ్వేకు ఇసుమంతైనా దక్కనీయకుండా.. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
మన్యం ప్రాంతంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు కలిసి పర్యటిస్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు పర్యటించే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం అలాగే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
రాజధాని అమరావతిలో సాంకేతిక మౌలిక వసతులను కల్పించడం, ఆర్థిక సేవల రంగాన్ని ఆధునీకరించడం, డిజిటల్ లావాదేవీలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంక్ అమరావతిలో ఇటువంటి అధునాతన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఏపీ పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.