పెద్దారెడ్డికి తాడిపత్రిలో నో ఎంట్రీ బోర్డు.. జేసీ మార్క్ పాలిటిక్స్

Publish Date:Jun 15, 2025

Advertisement

 

సొంత ఇంట్లో అడుగుపెట్టలేని విధంగా తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకరరెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుపెట్ట లేకపోతున్నారు. హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చినా పోలీసుల నిస్సహాయత వ్యక్తం చేస్తుండటంతో ఇక పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టడం ఇప్పట్లో అసాధ్యమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి వేసిన వీరంగంతో వైసీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలవడం లేదంట. తాజాగా పెద్దారెడ్డి వస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
తాడిపత్రి నియోజకవర్గం అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  

అక్కడ రాజకీయాలు ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణలలో  ఎస్పీ, డివైఎస్పీలతో పాటు పోలీసు శాఖలో పలువురు అధికారులు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఘర్షణల్లో అరెస్ట్ అయిన పెద్దారెడ్డికి కండీషనల్‌ బెయిల్ ఇచ్చిన కోర్టు తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

ఇటీవల  పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు పట్టుకొని పెద్దారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను కలసి తాడిపత్రికి మీరు చెప్పినప్పుడు వెళ్తానని అనుమతి కోరారు. కానీ  పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెడితే ఊరుకునేది లేదని,  అడుగుపెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని  వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అక్కడి వాతావరణం చూసిన పోలీసులు  పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే 2024 ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆయన పర్యటనకు బ్రేకులు వేశారు. హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న తరువాత మొదటిసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా వరుసగా ఎంపీపీ ఎన్నికలు, రాప్తాడులో జంట హత్యలు కారణంగా చూపిస్తూ బందోబస్తు కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు. 

ఇక మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు జిల్లా పోలీసు అధికారులు అనుమతి కోరగా ఆ సమయంలో మహానాడు జరుగుతుందని అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ పర్యటన అంటూ మరోసారి అనుమతించలేదు. ఆ క్రమంలో తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి  పైగా  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు. 

ఈ పరిస్థితిపై పెద్దారెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జేసీ ప్రభాకరరెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు  అనుమతిచ్చినా తనను సొంత సెగ్మెంట్లో అడుగుపెట్టనీయక పోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తాడిపత్రికి వెళ్లడం అసాధ్యమేనని  నిర్వేదంగా మాట్లాడుతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అధికారం అండతో ఓవర్ చేస్తున్నారంటూ జేసీ వయస్సు గురించి మాట్లాడుతున్నారు.
ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్స సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ప్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకరరెడ్డి ఆందోళనలకు సిద్దమైతే పోలీసులతో అడ్డుకున్నారు. 

జేసీ ఇంట్లోకి  వెళ్లి సోఫాలో కూర్చుని సినీ స్టైల్లో ప్రగల్భాలు పలికారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకరరెడ్డి ఎంత ఫైర్ బ్రాండో వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు. ఆయన కొడుకు  అస్మిత్ రెడ్డి తర్వాత టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఇప్పుడాయన పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారంట. ఇలాంటి సిట్యుయేషన్‌లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు  రావడం  లేదంట.

తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు మూడు నెలలు  కావొస్తున్నా పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఫ్యాక్షన్ మొదలు పెడతానని జేసీ వర్గీయులకు పదేపదే వార్నింగులు ఇచ్చారు. ఇప్పుడు బేల చూపులు చూస్తూ నిర్వేదంతో మాట్లాడాల్సి వస్తోంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయం కృతాపరాధమే అంటున్నారు.  చూడాలి మరి  పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారో? ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారో?
 

By
en-us Political News

  
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.