ముప్పేట దాడితో విలవిల్లాడుతున్న మాజీమంత్రి పెద్దిరెడ్డి

Publish Date:May 22, 2025

Advertisement

 

రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా నడిపిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి  అన్నిదారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది. గతంలో మూడు జిల్లాలకు పరిమితమైన అయన హావాను కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్దమైంది. అందులో బాగంగానే అయన నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపిందంటున్నారు. దాంతో పాటు అయన అస్తులపై విజిలెన్స్ నివేదిక అదారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయడంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా పీలవుతున్నారంట.వైసీసీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు.  

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నప్పటికి చాల తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం చిత్తూరు జిల్లాలో కలిపించుకున్నారు. ఆయన కూమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపి కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్న తంబల్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికితోడు అయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గర బంధువులు ఉన్నారు. మరో వైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా తనకు ప్రోటో‌కాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది.అయితే అయన వ్యాపారాలు అస్తులు తిరుపతిలో ఉండటంతో పాటు అయన అనుంగు శిష్యులు అంతా తిరుపతి జిల్లాలో ఉండటంతో ఇక్కడ కూడా అయన ప్రభ వెలిగిపోయింది అధికారం ఉన్నప్పుడు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన వర్గం 2019-24 మద్య కాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాలలో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల అక్రమణ జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళం పెట అటవీ భూముల్లో  సరిహద్దు రాళ్లు నాటిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది. పాకాల కోర్టులో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలు అయ్యాయి. మదనపల్లి బండమీదామ్మపల్లెలో అయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సీఐడీ కోర్టులో ప్రోసీడింగ్స్ మొదలయ్యాయి.. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం,  పార్టీ కార్యాలయం, గోశాల అన్నీ బుగ్గ మఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్ మెంటు నివేదిక అదారంగా అయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఇక ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి నాలుగో నిందితుడు.  అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవ్వడంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోపెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచింది. అప్పట్లో అయనను కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోన మిగతా జిల్లా మంత్రులు , సీనియర్లు ప్రయత్నించినప్పటికి ఫలించలేదు. అప్పట్లో డిప్యూటీ సియం గా ఉన్న నారాయణ స్వామి కంటే మాములు మంత్రి అయన పెద్దిరెడ్డికి అధికారిక కార్యక్రమాలలో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సియం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే ద్దిరెడ్డి కూర్చున్న పోటోలు అప్పట్లోసోషియల్ మీడియాలో  పెద్దఎత్తున హల్ చల్ చేసాయి. ఇక రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం చూస్తూ తనకు మంత్రి హోదా ఎందుకు అని ఫీలైన సందర్భాలున్నాయంట. ఇలాంటి తరుణంలో అయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండటంతో పుంగనూరుని చిత్తూరులో కలవవద్దని వైసీపీ నేతలు కోరారంట.

 కాని అప్పుడు పెద్దిరెడ్డి హావా ముందు వీరి మాటలు సాగలేదంట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా తిరుపతి ,చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయడానికి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసింది. దాంతో పాటు పుంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుందంట. పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండటంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారంట.

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.