కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం : హరీశ్ రావు
Publish Date:Jun 4, 2025
Advertisement
వేములవాడ దేవాలయంలో కోడెలు మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కోడెలను కాపాడడం ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్‌కి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి.మేం కాపాడుకుంటాం.. అంటూ హారీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.వారం రోజుల్లో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. రోజూ కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోగా కనీస స్పందన కూడా లేదంటూ ఫఐర్ అయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థాన పరిస్థితి ఇలా ఉంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 18 వేల రూపాయలు రైతులకు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో 40 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తాని సీఎం రేవంత్ హామీ అయిందని హరీష్ రావు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు హడ్కో నుండి తెచ్చిన 3000 కోట్లను బడా కాంట్రాక్టర్లకు ఇచ్చారని తెలిపారు.ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/former-minister-harish-rao-39-199311.html





