పొత్తు పొడుపుపై చేగొండి లేఖాస్త్రం.. సలహాలూ సూచనలతో పవన్ కు దిశా నిర్దేశం!

Publish Date:May 19, 2022

Advertisement

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడుపు కోసం యావత్ ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. జగన్ రాక్షస పాలన అంతం కావాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోవడమొక్కటే మార్గమని సాధారణ జనం సైతం విశ్లేషణలు చేస్తున్నారు. రాజకీయాలలో తలపండిన నేతలు సైతం చాలా సీరియస్ గా పొత్తు పొడిస్తే లాబాలేమిటి? లేకుంటే నష్టాలేమిటి వంటి లెక్కలు వేస్తున్నారు. దాదాపు రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలంట్ గా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా  తెలుగుదేశం, జనసేనల పొత్తు పొడుపుపై ఉత్సుకతతో ఉన్నారు.

రాజకీయ అనుభవమే కాకుండా ఆయనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ వరకూ అన్ని పార్టీలలో ఆయన పని చేశారు.  ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవమే కాకుండా.. గోదావరి జిల్లాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన కాపు సామాజిక వర్గం ఆయనను ఒక పెద్ద దిక్కుగా భావిస్తుంటుంది. ఇప్పుడు ఆయన ఆ పెద్దరికాన్ని చూపుతూనే పవన్ కల్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు. కాపు సంక్షేమ సేన తరఫున ఆ బహిరంగ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కాపు సంక్షేమ సేన నేతగానే కాకుండా.. ఏదో వాత్సల్యం ఆయనకు జనసేనాని పవన్ కల్యాణ్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది.

పవన్ కల్యాణ్ జసనేస పార్టీ పెట్టినప్పటి నుంచీ  మాజీ మంత్రి హరిరామ జోగయ్య సలహాలూ, సూచనలూ ఇస్తూనే వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం చాలా సీరియస్ గా ఆయన జనసేనానికి గైడ్ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ చేగొండి హరిరామ జోగయ్య తాజాగా పవన్ కు బహిరంగ లేఖ రూపంలో ఇచ్చిన సలహా ఏమిటంటే.. వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనల వలలో పడి తెలుగుదేశం పార్టీకి దూరం కావద్దని. తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే వైసీపీని అధికారానికి దూరం చేయడం సాధ్యమౌతుందని. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రాష్ట్రంలో పొత్తు పొడుపులు ఉంటేనే ప్రజాకాంక్ష నెరవేరుతుందని చేగొండి హరిరామ జోగయ్య పవన్ కు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఆవేశంతో పొత్తుకు దూరం జరగద్దని సలహా ఇచ్చారు. వస్తే గిస్తే బీజేపీనీ కలుపుకు పొమ్మని చెప్పారు. దమ్ముంటే ఓంటరి పోరంటూ వైసీపీ చేస్తున్న కవ్వింపులు ఆ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నవేనని, అందుకే కవ్వింపులకు రెచ్చిపోకుండా సంయమనంతో ఆలోచించి, దార్శనికతతో నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చేశారు.  

చేగొండి లేఖపై పవన్ కల్యాణ్ సీరియస్ గా ఆలోచిస్తున్నారనీ, సన్నిహితులతోనూ పార్టీ నేతలతోనూ తెలుగుదేశంతో పొత్తుపై సీరియస్ మంతనాలు జరుపుతున్నారనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే  పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వరాదని వచ్చిన నిర్ణయానికి చేగొండి లేఖ మరింత బలం చేకూర్చిందని అన్నారు. జనసేన అధికారంలోకి రావాలంటే ముందుగా రాష్ట్రంలో బలోపేతం కావాలనీ, అందుకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటేనే మేలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  గత ఎన్నికలలో పొత్తు లేకుండా పోటీ చేయడం వల్లనే ప్రతికూల ఫలితాలు వచ్చాయని ఆయన అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.  

By
en-us Political News

  
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి ఉత్తరాఖండ్‌లో ఒక సాంస్కృతిక వేడుకలో తీవ్రమైన చేదు అనుభవం ఎదురైంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వందేళ్లు దాటినా తగ్గని ఉత్సాహం.. 101 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్య రహస్యాలు ఇవే.!
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.