Publish Date:Jul 23, 2025
ఐదేళ్ల వైసీపీ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడిన వాళ్లు, అడ్డగోలుగా అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవాళ్లు ఒక్కొక్కరుగా ఇప్పుడు చట్టం ముందు నిందితులు నిలబడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారం అండతో చెలరేగి ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరికీ ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అక్రమ మైనింగ్ ఉచ్చు గట్టిగా బిగుసుకుంది. నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఇప్పుడు మరో మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ గ గుర్తింపు పొందిన అనిల్ కుమార్ వంతు వచ్చింది.
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. క్వార్ట్జ్ గనుల లీజు ముగిసిన తర్వాత కూడా తవ్వకాలు జరిపినట్టు శ్రీకాంత్ రెడ్డి తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు ముట్టినది టన్నుకు వెయ్యి రూపాయలు మాత్రమేనని వెల్లడించాడు. క్వర్ట్జ్ అక్రమ మైనింగ్ లో తాను అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకే పని చేశానని కూడా వెల్లడించాడు. దీంతో ఈ కేసులో మాజీ మంత్రి అనిల్ పాత్ర నిర్ధారణ అయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇక శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇక పోలీసులు కూడా త్వరలో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమౌతున్నారు.
అదలా ఉంటే అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో ఈ కేసులో 200 కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు దర్యాప్తులో తేలిందని దర్యాప్తు అధికారలు చెబుతున్నారు. ఈ కేసులో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, అనిల్ కుమార్ ల ప్రమేయం నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ మాత్రమే ఉన్నారని భావించినా, శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో అనిల్ కుమార్ పాత్ర కూడా తేటతెల్లమైందనీ, త్వరలో కేసు నమోదు చేస్తామనీ, నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు చేయడానికి కూడా వెనుకాడమోమనీ అంటున్నారు.
అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అక్రమార్జనలోనే కాదు.. అనుచిత భాషా ప్రయోగంలో కూడా ఇష్టారీతిగా రెచ్చిపోయారు. వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడే నాయకుడిగా గుర్తింపు పొందారు. గట్టిగా మాట్లాడడమంటే ప్రత్యర్థులపై అనుచిత భాషతో చెలరేగిపోవడం అని తెలిసిందే. గతంలో అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపైనా, లోకేష్, పవన్ కల్యాణ్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొడగొట్టి, మీసం మెలేసి మరీ సవాళ్లు విసిరారు. అయితే వైసీపీ పరాజయం తరువాత.. అనిల్ కుమార్ యాదవ్ దాదాపు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇటీవలే తెరపైకి వచ్చి మాట్లాడటం ప్రారంభించారు. అంతలోనే గతంలో తాను చేసిన అక్రమాలకు చెందిన కేసులో ఇరుక్కున్నారు. త్వరలో కటకటాల వెనక్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-anilkumar-booked-in-quartz-illegal-mining-25-202519.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.