అనిల్ కుమార్ యాదవ్ మెడకు మరో వివాదం

Publish Date:Jun 30, 2023

Advertisement

వివాదాలు ఆయనను చుట్టుముడతాయో.. ఆయనే వివాదాలను ఆహ్వానిస్తారో తెలియదు కానీ  వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నిత్యం వివాదాలలోనే ఉంటారు. ఆయన మాట్లాడితే వివాదం, మౌనంగా ఉంటే వివాదం అన్నట్లుగా ఆయన తీరు, వ్యవహారశైలి ఉంటుంది. తాజాగా   అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నారు. నెల్లూరు నగరంలో మళ్లీ తన సత్తా చాటు కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో    అనిల్  మరో వివాదంలో చిక్కుకోవడంతో  ఆయన అనుచరవర్గంలో వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. వివరాల్లోకి వెడితే..  

హైదరాబాద్‌  గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్ వద్ద.. భద్రత సిబ్బందితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు ఆయన అనుచరులు ఘర్షణకు దిగి.. వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన   ఓ వీడియో   అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్బంగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్..  సైలెంట్ అయిపోయారనీ... ఆ క్రమంలో ఆయన చుట్టు ఉన్న వారంతా.. ఆయన బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వర్గంలోకి వెళ్లిపోయారని... దీంతో అనిల్ ఒంటరిగా మిగిలిపోయారని చెబుతున్నారు. అయితే మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యాక్టివ్‌ అయ్యేందుకు అనిల్ కుమార్ యాదవ్ .. రంగం సిద్దం చేసుకొంటున్నారని... అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ పాదయాత్రపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి వేళ.. అటు అనిల్ కుమార్ యాదవ్, ఇటు నారా లోకేష్‌ ఇరువురి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొంటున్నాయని నెటిజన్లు ఈ సందర్బంగా వివరిస్తున్నారు. 

అదీకాక.. రానున్న ఎన్నికల్లో అనిల్ కుమార్‌కు సీటు ఇచ్చేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం  జగన్ సంకోచిస్తున్నారని.. అందుకే ఆయన బాబాయి రూప్‌ కుమార్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. ఆయనతో రాజకీయం చేస్తున్నారనే ఓ చర్చ సైతం సింహపూరి జిల్లాలో ఇప్పటికే కొనసాగుతోంది. 

మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధినేతలపై సవాళ్లు విసురుతూ.. తొడలు గొడుతూ, మీసాలు మెలేస్తూ సవాళ్లు విసిరేవారనీ, అయితే తన మంత్రిపదవిని ఊడబెరికిన జగన్  అదే జిల్లాకు చెందిన  కాకాణి గోవర్దన్ రెడ్డికి ఆమాత్య పదవి కట్టబెట్టడం అనిల్ కుమార్ యాదవ్‌కు మింగుడు పడలేదనీ అంటారు.  అలాంటి వేళ  అప్పట్లో చోటు చేసుకున్న వరుస పరిణామాలు అందరికీ తెలిసినవేనని.. ఆ తర్వాత స్తబ్ధుగా మారిన ఆయన ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయి.. చెలరేగిపోతున్న సమయంలో.. ఇలా హైదరాబాద్‌లో వాహనాల పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగి.. దాడి చేయడాన్ని చూస్తుంటే.. అనిల్ కుమార్ యాదవ్‌లో ప్రస్ట్రేషన్ పీక్స్‌కి చేరిందన్న ప్రచారం  నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జోరందుకోంది. 

ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్‌ను ఆ పార్టీ అధినేత   జగన్ నుంచి తెచ్చుకొని.. ముచ్చటగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలుస్తారా? లేకుంటే తన బాబాయిని రంగంలోకి దింపితే.. ఆయనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తారా? లేదా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తారా అన్న సింహపురి ప్రజల్లో  జోరుగా సాగుతోంది.  ఇక నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.నారాయణ పేరు దాదాపు ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో.. నెల్లూరు వైసీపీ అభ్యర్థి అబ్బాయి అనిల్ కుమార్  యాదవా లేకుంటే బాబాయి రూప్ కుమార్ యాదవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. జగన్ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని,  వైనాట్ 175 సమీక్షా సమావేశాల్లో క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తున్న విషయం విదితమే.

By
en-us Political News

  
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.