ఇంటర్ పాసైన మావోయిస్టు మాజీ నేత దేవ్ జీ

Publish Date:Jun 12, 2026

Advertisement

పట్టుదల ఉంటే చదువుకు వయస్సు అడ్డం కాదని నిరూపించారు మావోయిస్టు మాజీ నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ.  ఒకప్పుడు తుపాకీ పట్టి దండకారణ్యంలో  దళాలను నడిపించిన ఆయన..  ఇప్పుడు పుస్తకం పట్టి విజయాలు సాధిస్తున్నారు. ఆయుధం విడిచి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ  న్యాయవాది కావాలనే తన జీవిత ఆశయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే..  42 ఏళ్ల  విరామం తర్వాత   ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.  

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ..  నాలుగు దశాబ్దాల క్రితం మధ్యలో ఆగిపోయిన తన చదువును మళ్లీ కొనసాగించాలని గట్టి సంకల్పంతో  శ్రద్ధగా చదివి ఇంటర్ పరీక్షలు రాశారు.  ఈ పరీక్షల్లో ఆయన   349వ  ర్యాంకు సాధించారు.   ఐదేళ్ల లా కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ తప్పనిసరి. 

దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో..  దేవ్‌జీ ఇటీవల జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 42 ఏళ్ల క్రితం మిగిలిపోయిన ఆ ఒక్క తెలుగు పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన తెలుగు సబ్జెక్టులో 100 మార్కులకు గాను 72 మార్కులు సాధించి ఘన విజయం సాధించారు. దీనితో మొత్తం 614 మార్కులతో ఆయన ఇంటర్మీడియట్ విద్యను అధికారికంగా పూర్తి చేశారు. తుపాకీ పట్టిన చేత్తో కలం పట్టి, విద్య ద్వారా కొత్త జీవితాన్ని అద్భుతంగా ప్రారంభించిన దేవ్‌జీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోంది.

By
en-us Political News

  
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సరికొత్త రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. విన్నర్, రన్నరప్ జట్లకు దక్కే కోట్ల ప్రైజ్ మనీ వివరాలు మరియు కొత్త టోర్నీ ఫార్మాట్ విశేషాలు మీకోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ మోసాలపై భారత ప్రభుత్వం బ్యాంకులు మరియు యూపీఐ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.
భూమిపై మొట్టమొదటి సంక్లిష్ట కణాల (Eukaryotes) ఆవిర్భావం వెనుక ఉన్న జన్యు రహస్యాలను బార్సిలోనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్లు, బ్యాక్టీరియాల అద్భుత సమ్మేళనంతో జరిగిన ఈ జీవ పరిణామ క్రమం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
2027 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సురేశ్ రైనా ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ, ప్రిన్స్ యాదవ్ ఎంపికపై అనిల్ కుంబ్లే చేసిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ డీల్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో ఊరట లభించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్ల కంటే కిందకు పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ తాజా అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ అద్భుత ప్రస్థానం. మహ్మద్ సిరాజ్ రాకతో పెరిగిన అంచనాలు, గ్రాస్‌రూట్ లెవెల్ క్రికెట్ విజన్ మరియు అప్డేట్స్ ఇక్కడ చూడండి.
గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను శాసించేందుకు భారత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్. యూఏఈతో కుదిరిన మెగా ఒప్పందం వల్ల భారత్‌లో 30 మిలియన్ బారెల్స్ చమురు నిల్వలు పెరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు వెళ్తున్న యువతిని నడిరోడ్డుపై వదిలేసిన ఓలా ఆటో డ్రైవర్.. ఊరికే వదలకుండా కోర్టుకు లాగిన బాధితురాలు. ఓలా సంస్థకు రూ. 55,000 భారీ జరిమానా విధించిన కర్నూలు వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు వివరాలు ఇక్కడ చదవండి.
ఆ యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సైదాబాద్‌కు చెందిన యువతి షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమె బాత్‌రూమ్‌లో ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారతీయ బ్యాంకులు ఎన్నారైల కోసం FCNR(B) డిపాజిట్లపై వడ్డీ రేట్లను దాదా్యూ 7 శాతానికి పెంచాయి. భారత్‌లో ఎటువంటి పన్ను లేకుండా, కరెన్సీ రిస్క్ లేకుండా విదేశీ కరెన్సీపై భారీ లాభాలను పొందే అద్భుతమైన అవకాశం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్! జూలై 1 నుంచి యూఎస్ బి1/బి2 వీసా ఇంటర్వ్యూల కోసం సరికొత్త ఫాస్ట్ ట్రాక్ పైలట్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. అదనపు ఫీజు, దరఖాస్తు విధానం మరియు కండిషన్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో నేడు ఐపీఓల సందడి నెలకొంది. హెక్సాగన్ న్యూట్రిషన్ అరంగేట్రంతో పాటు హారిజన్ రీక్లెయిమ్, ఉత్కల్ స్పెషాలిటీ ఐపీఓల లేటెస్ట్ అప్‌డేట్స్ మరియు రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సిన లాభనష్టాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి.
అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అలస్కా తీరంలో 368 మిలియన్ డాలర్ల సముద్ర పర్యవేక్షణ నెట్‌వర్క్ (OOI)ను మూసివేస్తోంది. 900 పైగా సెన్సార్ల తొలగింపుతో వాతావరణ మార్పులు, మత్స్య పరిశ్రమ మరియు తుఫానుల అంచనాలు ఎలా దెబ్బతిననున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.