Publish Date:Dec 28, 2024
మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. కన్ ఫర్డ్ ఐఏఎస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ గత ఎన్నికలకు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ తీర్థం పుచ్చుకుని మరీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
తొలి నుంచీ వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఇంతియాజ్ అహ్మద్ వైసీపీ హయాంలో కీలక జిల్లాలకు కలెక్టర్ గా పని చేశారు. ప్రభుత్వంలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఇంతియాజ్ అహ్మద్ కు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చే వారు. అటువంటి ఇంతియాజ్ అహ్మద్ తనకు ఎన్నికలలో పోటీ చేయాలని ఉందన్న ఆసక్తి కనబరచగానే జగన్ ఓకే అనేశారు. అంతే ఆఘమేఘాల మీద వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ గూటికి చేరిపోయారు. కర్నూలు, లేదా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే చివరకు జగన్ ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టి కర్నూలు నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు.
అయితే ఇంతియాజ్ అహ్మద్ ఓడిపోవడం, అలాగే వైసీపీ కూడా అధికారంలోకి రాకపోవడంతో జగన్ ఇంతియాజ్ అహ్మద్ ను పట్టించుకోవడం మానేశారు. దాంతో పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-intiaz-ahmed-resigns-ycp-25-190446.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.