డామిట్ కథ అడ్డం తిరిగింది.. మాజీ హోంమంత్రి సుచరిత ఆవేదన

Publish Date:Jun 11, 2022

Advertisement

టైమ్ బాగుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది...అదే బాగు లేకపోతే తాడే పామై కరుస్తుంది. ప్రస్తుతం ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత టైం ఏ మాత్రం బాగోలేదనిపిస్తోంది. మేకతోటి సుచరిత హోంమంత్రి పదవిని కోల్పోయి కేవలం రెండంటే రెండు నెలలయ్యింది. ఈ రెండు నెలలలో ఆమె పార్టీ అధిష్ఠానం నుంచీ, క్యాడర్ నుంచీ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవమానాలు భరించారు. ఒక దశలో ఏకంగా ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.  ఆ తరువాత ఎలాగోలా పరిస్థితి సద్దుమణిగిందని అనిపించింది. సుచరిత కోరుకున్నట్లుగా అధిష్ఠానం నుంచి పిలుపూ వచ్చింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే మంత్రి పదవి పోయింది తప్ప మరే ఇతర కారణాలూ లేవనీ హై కమాండ్ ఆమెకు నచ్చ చెప్పింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఆమె భర్త మేకతోట దయాసాగర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇందుకు కారణమేమిటంటే మళ్లీ వైసీపీలోని మేకతోట సుచరిత వ్యతిరేక వర్గమే కారణమని తేలుతోంది. స్వయంగా సుచరితే  ఈ ఆరోపణ చేస్తున్నారు. సుచరిత హోంమంత్రిగా ఉన్న సమయంలో  ఆమె భర్త, ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్  విజయవాడలో ఆదాయపన్ను శాఖలో కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆ  సమయంలో పలువురు వైసీపీ నేతలు స్వయంగా ఐటీ కార్యాలయానికి వెళ్లి దయాసాగర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పి ఫోటోలు  దిగారు.

అయితే ఆయన స్వరాష్ట్రానికి రావడం.. అదీ కీలక పదవిలో రావడం.. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ కీలక నేతలకు ఏ మాత్రం నచ్చలేదని సమాచారం. దీంతో వారు ఆగమేఘాల మీద రంగంలోకి దిగి.. ఓ రాష్ట్రంలో భార్య కీలక మంత్రి పదవిలో ఉండి.. భర్త మరో కీలక పదవిలో ఉండడం చట్టాలకు విరుద్దమంటూ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేయడమే కాదు.. సుచరిత భర్తను మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు బదిలీపై సాగనంపే వరకు సదరు నేతలు నిద్రపోలేదు. ఈ విషయాన్ని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

అంతేకాదు.. దయాసాగర్ బదిలీ కోసం ఆ నేతలు ఢిల్లీలోనే  తిట్ట వేసుకుని.. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో దగ్గరుండి మరీ దస్త్రాలు కదిలేలా చేశారనే టాక్.. కూడా అప్పట్లో హాట్ హాట్‌గా నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడింది. కానీ ఈ దయాసాగర్‌కు అక్కడ పని చేయడం సుతరాము ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో ఆయన వీఆర్ఎస్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇలా దరఖాస్తు చేసుకోవడం.. అలా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం.. శర వేగంగా జరిగిపోయిందట.
     
మరోవైపు దయాసాగర్ పదవి విరమణ తర్వాత..  ఆయన్ను లోక్‌సభ లేదా అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని సుచరిత స్కెచ్ వేశారని.. ఆ క్రమంలోనే ఆయన్ని స్వరాష్ట్రానికి రప్పించారని.. ఇక్కడే ఉద్యోగం చేసి... ఇక్కడే పదవి విరమణ చేసిన తర్వాత.. ఆయన్ని రాజకీయాల్లోకి దింపాలని ఈ మాజీ మంత్రిగారు ప్లాన్ సిద్దం చేసుకున్నారని... కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వైసీపీ    కీలక నేతలు .. దయాసాగర్‌ను బదలీ చేయించే వరకు నిద్రపోలేదనే వార్త వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.  మరి తాజాగా మాజీ అయిన హోం శాఖ మంత్రి భర్త.. వచ్చే ఎన్నికల్లో ఏదైనా నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబడి.. తన సత్తా చాటి.. తనను బదిలీ చేయించిన  వైసీపీ నేతలకు ఝలక్ ఇస్తారా? అనే చర్చ అయితే ఇప్పడు పత్రిపాడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.