మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

Publish Date:Apr 22, 2026

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం  మరణించారు.   నాదెండ్ల భాస్కరరావు తెలుగు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.  వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1978లో  తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తదుపరి కాలంలో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, ఆయన  వెంట నడిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 

1984లో  ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో.. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు ఒక నెల రోజుల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.  

ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిన భాస్కరరావు, 1989లో తెనాలి నుండి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత 2019లో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

By
en-us Political News

  
2023లో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది.. కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు.
జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్‌గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది.
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్త విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు.
ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీని ఆశ్రయించి భక్దులకు సులభంగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన చర్యల వల్ల ఇప్పడు భకులకు మరీ జాగు లేకుండా శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. భక్తులకు జాగు లేకుండా స్వామివారి దర్శనం లభిస్తుండటంతో కొండపై వసతి లభ్యత కూడా పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది.
ముందస్తు బెయిల్ పిటిషన్ లో దాఖలైన మధ్యంతర రక్షణ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు వాదనలు విన్నది.
కరువు భత్యాన్ని (డీఏ) పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో షోరూమ్‌లో ఉన్న ఫర్నిచర్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంట లను అదుపులోకి తీసుకు వచ్చారు.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శక పరిచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక అడుగు వేసింది.
రాయల్ బాటిళ్లలో లోకల్ మద్యం నింపి, ప్రీమియం లిక్కర్ పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.