ఆడపిల్ల పుడుతుందనే.. బలవంతపు అబార్షన్.. తల్లీబిడ్డల ప్రాణాలు బలి..!

Publish Date:Jul 27, 2026

Advertisement

 

తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం... కన్న కూతురి ప్రాణాన్నే బలితీసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది."గర్భంలో పెరుగుతున్న శిశువు... ఆడపిల్ల అని తెలిసింది. ఆ క్షణం నుంచి ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో... అమానుష నిర్ణయం తీసుకున్నారు. కూతురు, అల్లుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. "ఆడపిల్ల వద్దు" అనే ఆలోచన... చివరకు ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది. అక్రమంగా నిర్వహించిన గర్భస్రావం వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాల కోసం పోరాడిన శ్రావణి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంకా ఈ లోకాన్ని చూడని పసికందు కూడా... తల్లి ఒడిని చేరకముందే శాశ్వతంగా దూరమైంది. ఒక ఆడబిడ్డ పుట్టకూడదనే నిర్ణయం... చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఒకటి గర్భంలోని చిన్నారి... మరొకటి ఆ చిన్నారికి జన్మనివ్వాల్సిన తల్లి.

ఆడపిల్ల పుడుతుందనే కారణంతో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం చివరకు కన్నకూతురి ప్రాణాలనే బలితీసుకుంది. కూతురు, అల్లుడి ఇష్టాన్ని ఏమాత్రంపట్టించుకోకుండా గర్భంలో ఆడ శిశువు ఉందని తెలుసుకున్న తల్లి, బలవంతంగా గర్భస్రావం చేయించింది. అక్రమంగా నిర్వహించిన ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావానికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన జనగామ జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం మృతురాలు శ్రావణి గర్భవతిగా ఉండగా స్కానింగ్ ద్వారా గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లుగా తల్లి శోభ తెలుసుకున్నారు. అనంతరం కూతురు, అల్లుడి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మృతురాలి తల్లి శోభ, జనగామలో ఏఎన్‌ఎంగా (ANM) పనిచేస్తున్న అనసూయ సహకారంతో ఈ నెల 21న ఆమె ఇంట్లో నే అక్రమంగా అబార్షన్ చేయించింది.అబార్షన్ అనంతరం 22వ తేదీ రాత్రి శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. తొలుత జనగామలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణిం చింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25న శ్రావణి మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతురాలి భర్త భాస్కర్ జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆర్‌ఎంపీ శ్రవణ్, స్కానింగ్ నిర్వహించిన ప్రవీణ్, ఏఎన్‌ఎం అనసూయ, మృతురాలి తల్లి శోభపై కేసులు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 125, 89, 49తో పాటు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) Act సెక్షన్లు 5, 5(3), 5(4), అలాగే ఫ్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్  (PCPNDT) Act సెక్షన్ 23 కింద కేసులు నమోదు చేశారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ ఎలా జరిగింది? అక్రమ అబార్షన్‌కు ఎవరు సహకరించారు? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

Forced Abortion, Female Foeticide, Sex-Selective Abortion, Gender Discrimination, Janagama district, Shravani, baby girl, Crime News, Shocking Incident, Medical Negligence, PCPNDT Act, MTP Act, BNS Case


 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం
మానవ మెదడు తరంగాలు Brain Waves ఫిజికల్ ఏఐ రంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. ఆలోచనల ద్వారా రోబోలను నియంత్రించే అధునాతన సాంకేతికత మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
బ్లూటూత్ సెక్యూరిటీ లోపాల వల్ల ఏకంగా 22 లక్షల కార్లు హ్యాక్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. KARR యాంటీ థెఫ్ట్ సిస్టమ్ ద్వారా కారు డోర్లు అన్‌లాక్ చేసే ముప్పుపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆనంద్ రాఠీ వెల్త్ Q1 FY27 ఆర్థిక ఫలితాలలో 24% లాభాల వృద్ధితో రూ. 116 కోట్ల నికర లాభాన్ని మరియు రూ. 1.06 లక్షల కోట్ల AUM మైలురాయిని సాధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎంఆర్‌ఎఫ్ MRF కంపెనీలో ప్రమోటర్ కుటుంబం ఎంత వాటా కలిగి ఉందో తెలుసుకోండి. మామ్మన్ ఫ్యామిలీ, రిటైల్ ఇన్వెస్టర్లు మరియు FIIల షేర్‌హోల్డింగ్ వివరాలతో కూడిన సమగ్ర కథనం!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితులను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తూ రైతుల పంటలను రక్షించేందుకు సమగ్ర కార్యాచరణ
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు జూలై 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.