వైసీపీ నేత‌ల‌ను త‌రిమేస్తున్న ముంపు బాధితులు!

Publish Date:Sep 5, 2024

Advertisement

విజ‌య‌వాడ‌ను కనీవినీ ఎరుగని రీతిలో వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. కుండపోత వ‌ర్షానికి తోడు బుడ‌మేరు ఉధృతికి బెజవాడ న‌గ‌రం చిగురుటాకులా వ‌ణికిపోయింది. బుడమేరు ముంచెత్తడంతో ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరద నీటిలో అజిత్‌ సింగ్‌నగర్‌, పాయకాపురంతోపాటు ప‌లు ప్రాంతాలు మునిగిపోయాయి. రాత్రివేళ‌ల్లో చిమ్మ‌చీక‌టిలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్ర‌జ‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. అయితే, సీఎం చంద్ర‌బాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు. వారికి ఆహారం, తాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. రాత్రిప‌గ‌లు తేడా లేకుండా ముంపు ప్రాంతంలో బోటుపై ప్ర‌యాణిస్తూ నేనున్నా.. భ‌య‌ప‌డ‌కండి అంటూ బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగ‌డంతో మంత్రులు, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. దీంతో వ‌ర‌ద బాధితుల‌కు సకాలంలో ఆహారం, తాగునీరు అందింది. బోట్లు వెళ్ల‌లేని వ‌ర‌ద మంపు ప్రాంతాల్లో  జేసీబీ ఎక్కిమ‌రీ చంద్ర‌బాబు వెళ్లారు. అక్క‌డి బాధితుల‌కు ధైర్యం చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి 74ఏళ్ల వ‌య‌స్సులో కూడా చంద్ర‌బాబు  పడుతున్న తపనను, చేస్తున్న కృషిని, ప‌డుతున్న క‌ష్టాన్నిచూసి జనం జేజేలు పలుకుతున్నారు.  కొంద‌రు ముంపు బాధితుల‌యితే.. మా ప్రాణాలు కాపాడిన దేవుడు చంద్ర‌బాబు అంటూ క‌న్నీరు పెట్టుకున్నారు. చంద్ర‌బాబు నిద్ర‌మానుకొని రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బుడమేరు వరద నుంచి విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. అజిత్‌ సింగ్‌నగర్‌, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల‌తో వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు సాగుతున్నాయి. మంత్రులు, అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నది. అయితే, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధితుల‌కు ధైర్యం క‌ల్పించాల్సిందిపోయి.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప్రాధాన్య‌త నిచ్చారు. చంద్ర‌బాబు వ‌ల్లే విజ‌య‌వాడ‌కు ఈ దుస్థితి వ‌చ్చిందంటూ అర్థ‌ప‌ర్దం లేని లాజిక్కులు చెప్పాడు. బుడమేరు గేట్లు ఎత్తేశారని ఒక సారి, బుడమేరు నది అని మరోసారి మాట్లాడి తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లే కాదు, వైసీపీ శ్రేణులు సైతం మండిప‌డుతున్నాయి. విజ‌య‌వాడ వ‌ర‌ద ముంపు నుంచి తేరుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు మొద‌ల‌య్యాయి. ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి వాస్త‌వాల‌ను గుర్తించ‌కుండా బాధితుల‌కు ఆహారం, తాగునీరు అంద‌డం లేద‌ని ఫేక్ ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని వైసీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ఒక‌ ప‌క్క ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అన్నిసౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటే జ‌గ‌న్ అనుకూల సోష‌ల్‌మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారంపై న‌గ‌ర వాసులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ ప్రాంతాల్లోకి వ‌చ్చిన వైసీపీ నేత‌ల‌ను త‌రిమేస్తున్నారు. 

న‌గ‌రంలోని రాజ‌రాజేశ్వ‌రి పేట‌లో బుధ‌వారం (సెప్టెంబర్ 4) సాయంత్రం మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో బొత్స‌కు నిర‌స‌న సెగ ఎదురైంది. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు అందకుండా అడ్డుపడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఇప్పటి వరకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో లేనోళ్లం ఏటి సేత్తాం అంటూ.. స్థానికుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక బొత్స అక్క‌డి నుంచి వెనుదిరిగాడు. బొత్స ప‌ర్య‌టించిన అన్ని ప్రాంతాల్లోనూ బాధితుల నుండి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. మ‌రోవైపు.. ఎన్టీఆర్ జిల్లా కంచిక‌చ‌ర్ల‌లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేత‌, నందిగామ‌ మాజీ ఎమ్మెల్యే  మొండితోక జ‌గ‌న్మోహ‌న్ రావుకు స్థానికుల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. బాధితుల‌కు స‌రిగా సాయం అందించ‌డం లేదంటూ అధికారుల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలో స్థానికులు త‌మ‌కు అన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయ‌ని ఎమ్మెల్యేకు చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఎమ్మెల్యే వారిప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. నాలుగు రోజులుగా కూట‌మి నాయ‌కులు అన్ని విధాలుగా స‌హాయం అందిస్తుంటే.. ఇప్పుడు వ‌చ్చి బుర‌ద రాజ‌కీయాలు చేయ‌డంపై స్థానికులు మండిప‌డ్డారు. మొండితోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అత‌న్ని అక్క‌డి నుంచి త‌రిమేశారు.

వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌డం త‌ప్పుకాదు. కానీ, ప‌రామ‌ర్శ‌ల పేరుతో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి రాజ‌కీయాలు చేయ‌డం చాలా త‌ప్పు. ఒక‌ప‌క్క సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ముంపు ప్రాంతాల్లో వేగంగా ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ జ‌రుగుతున్నది. ఇప్పుడిప్పుడే వ‌ర‌ద నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వైసీపీ నేత‌లు ప‌రామ‌ర్శ‌  పేరుతో వెళ్లి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు తీరుమార్చుకోవాల‌ని, ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి స‌హాయం చేస్తే ప‌ర్వాలేదు.. రాజ‌కీయాలు చేస్తే త‌రిమికొడ‌తామ‌ని ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు హెచ్చ‌రిస్తున్నారు.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.