రైతు బంధు రూల్ వరద సాయానికి వర్తించదా! అంతా కేసీఆర్ సర్కారే చేసిందా?

Publish Date:Nov 19, 2020

Advertisement

హైదరాబాద్ లో వరద సాయం ఆగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమలులోనికి వచ్చినందున.. వరద బాధితులకు పరిహారంగా ఇస్తున్న 10 వేల రూపాయల సాయం పంపిణిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అదేశించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కోడ్ పేరుతో వరద సాయాన్ని ఎన్నికల సంఘం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రైతు బంధుకు వర్తించని రూల్.. వరద సాయానికి ఎలా అమలవుతుందన్న చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ అమలులో ఉన్నా.. రైతు బందు డబ్బులు రైతులకు అందించింది కేసీఆర్ సర్కార్. ఎలక్షన్ కోడ్ ఉన్నందున రైతు బంధు పంపిణి ఆపాలని విపక్షాలు గోల పెట్టినా.. అది కొత్త పథకం కాదని ఎన్నికల సంఘం ముందు వాదించి క్లియరెన్స్ తెచ్చుకుంది అప్పటి సర్కార్. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ గెలవడంలో రైతు బంధే కీలకమైందని చెబుతారు. ఏడాది క్రితం జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలోనూ రైతు బంధుపై వివాదం జరిగింది. హుజూర్ నగర్ నియోజకవర్గం వరకు నిధుల పంపిణి ఆపాలని విపక్షాలు ఆందోళన చేసినా.. ఆన్ గోయింగ్ పథకమంటూ పోలింగ్ ముందు రోజు కూడా రైతులకు రైతు బంధు నిధులు ట్రాన్ ఫర్ చేసింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు కూడా అలా చేయవచ్చు. కాని కేసీఆర్ సర్కార్ ఆ పని చేయలేదు. దీంతో ప్రభుత్వమే ఎన్నికల సంఘం ద్వారా వరద సాయాన్ని ఆపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. 2018 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు సాయాన్ని ఆపాలని విపక్షాలు కోరినప్పుడు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చింది.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్న పార్థసారథే. అప్పుడు ఆయన వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరిగా ఉన్నారు. రైతు బంధు పాత పథకమేనని ఎన్నికల అధికారులకు వివరణ ఇచ్చి నిధుల పంపిణికి ఆయన క్లియరెన్స్  తీసుకున్నారు. అప్పుడు ఆన్ గోయింగ్ కు పథకానికి ఎన్నికల కోడ్ వర్తించదని వాదించిన పార్థసారథి.. ఇప్పుడు ఎన్నికల అధికారిగా ఉంటూ ఆన్ గోయింగ్ స్కీంను కోడ్ పేరుతో ఆపేయాలని అదేశించడం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ లో వరద సాయం పంపిణి కూడా ఎప్పుడో నెల క్రితమే ప్రారంభమైంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ మూడు రోజుల క్రితం వచ్చింది. వరద సాయం నెల రోజుల నుంచి కొనసాగుతుంది కాబట్టి.. అది ఆనో గోయింగ్ స్కీం కిందకే వస్తుందని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు వివరించి క్లియరెన్స్ తీసుకోవచ్చనే అభిప్రాయం వస్తోంది. గ్రేటర్ లో చేస్తున్నది వరద సాయం. వరదలు విపత్తు కిందకు వస్తాయి. ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్నికల కోడ్ కు మినహాయింపులు ఉంటాయి. గతంలో చాలా సార్లు అలా జరిగింది. వరద విపత్తు సాయం చేస్తున్నామని సర్కార్ చెప్పినా ఎన్నికల సంఘం ఈజీగానే కన్విన్స్ అవుతుందని చెబుతున్నారు. 

 

వరద సాయం చేయాలని సర్కార్ కు చిత్తశుద్ది ఉంటే ఎన్నికల కోడ్ అడ్డంకే కాదని నిపుణులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా విపక్షాలను టార్గెట్ చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. విపక్షాలను బూచిగా చూపుతూ అడ్డదారుల్లో తప్పించుకునేందుకు టీఆర్ఎస్ కుట్రలు చేసిందనే విమర్శలు వరద బాధితుల నుంచి వస్తున్నాయి. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు వందల కోట్లు దోచి పెట్టి ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్ సర్కారే.. నిజమైన లబ్దిదారులకు ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో ఇలా ఎన్నికల సంఘం పేరుతో డ్రామాలు చేసిందనే  ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో రైతు బంధు నిధులు ఆపకుండా ఇచ్చినట్లుగానే  వరద సాయం పంపిణి కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  

 

నిజానికి వరద సాయం కోసం 550 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. అందులో ఇప్పటికే 5 వందల కోట్లను పంపిణి చేశారని అధికారిక లెక్కలె చెబుతున్నాయి. అయితే నిజమైన లబ్దిదారుల్లో కొంత మందికి మాత్రమే సాయం అందింది. వరద సాయం పేరుతో టీఆర్ఎస్ నేతలే డబ్బులు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సాయం కోసం వరద బాధితులు ధర్నాలు చేస్తుండటంతో మరో వంద కోట్లు పంపిణి చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇవి కూడా పార్టీ నేతలు కాజేస్తారనే భయంతో మీసేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రభుత్వం మరో 10 వేల మందికి సాయం చేయాలని భావిస్తే.. పరిస్థితి మాత్రం మరోలా మారింది. మూడు రోజుల్లోనే మీసేవా కేంద్రాల ద్వారా లక్షలాది దరఖాస్తులు వరద సాయం కోసం వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా వాయిదా వేయింది అడ్డుకుందనే విమర్శలు వస్తున్నాయి. వచ్చిన దరఖాస్తుదారులందరికి సాయం చేయాలంటే మరో నాలుగు, ఐదు వందల కోట్లు కావాలి. అంత డబ్బు సమకూర్చడం కష్టమని భావించిన ప్రభుత్వమే విపక్షాలను బూచిగా చూపి వరద సాయం ఆపిందనే చర్చ జనాల్లో జరుగుతోంది. 
          

మరోవైపు వరద సాయానికి బ్రేక్ పడటంతో బాధితులు భగ్గుమంటున్నారు. వరద సాయం పంపిణి నిలిపివేతపై రాజకీయ మంటలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బాధితులందరికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని న్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని చెప్పారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తావా? అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.