పెట్టుబడుల వరద.. ఉద్యోగాల వెల్లువ.. లోకేష్ దక్షిణ కొరియా పర్యటన.!

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అద్భుత విజయాలను సాధించింది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో  పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలలో ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ఖరారయ్యాయి.

వీటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది.. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీలో 5 వేల కోట్ల రూపాయల  పెట్టుబడితో   తన మూడో భారతీయ ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికే ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుండగా, దీని ద్వారా  పదిహేనువందల మంది ఐటీ, ఎలక్ట్రానిక్స్ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే  వైజాగ్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీపీ) ఏర్పాటు చేయాల్సిందిగా ఎల్‌జీ ప్రతినిధులను లోకేష్ కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపాక్ట్  వైజాగ్ వేదికగా ఏసిప్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో   468 కోట్ల పెట్టుబడితో  ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ద్వారా ఏడాదికి 96 మిలియన్ల సెమీకండక్టర్ పరికరాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు ఏపీ యువతకు సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్  సాంకేతికతల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు అపాక్ట్ అంగీకరించింది.

ఆటోమొబైల్,  స్మార్ట్ హెల్త్‌కేర్ విభాగాలలో కూడా ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ టెక్నాలజీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్  ప్రతినిధులతో లోకేష్ జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి.  తిరుపతి లేదా అనంతపురం పరిసనాలకల్లో..  ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి హ్యుందాయ్ హెబిస్ ముందుకు వచ్చింది.   అలాగే రూ. 300 కోట్ల పెట్టుబడితో సరికొత్త స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్ ఉత్పాదక రంగాన్ని ప్రారంభించేందుకు షూఆల్స్  సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో 3 వేలకు పైగా  కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు సోలమ్ గ్రూప్   శ్రీసిటీలో  338 కోట్ల రూపాయల అంచనాతో ఈవీ ఛార్జర్ పవర్ మోడ్యూల్స్,  ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సౌకర్యాన్ని వేగవంతం చేస్తోంది.

రాష్ట్రంలో స్టార్టప్ ఇకోసిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు అమరావతి వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్  ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను సృష్టించి, ఒక లక్ష ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ ప్రకటించారు.  వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ అనే అద్భుతమైన విజన్‌తో కొరియా దేశపు ఇన్నోవేటివ్ స్టార్టప్‌లను ఏపీకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఇండియా, కొరియా స్టార్టప్ కారిడార్, అలాగే  ప్రత్యేక కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని క్వాంటం మరియు ఏఐ క్యాపిటల్‌గా మార్చేందుకు సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల ఏర్పాటుకు ఆహ్వానించారు. మొత్తంగా గత 24 నెలల్లో దాదాపు 240 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ కీలక ప్రగతి సాధించిందని, ఈ కొరియా పర్యటన రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని లోకేష్ పేర్కొన్నారు.

Nara Lokesh South Korea Tour, AP Investments 2026, LG Sri City Plant, APACT Semiconductor AP

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.