Publish Date:Nov 15, 2024
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రచయిత, వైకాపా నేత పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ లో బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్స్ నమోదవుతున్నాయి. టిడిపి, జనసేన శ్రేణులతో బాటు ఒక టీవీ చానల్ విలేకరులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసానిపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే. టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న శ్రీరెడ్డి పై కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. కృష్ణా జిల్లా గుడి వాడ వన్ టౌన్ పోలీసులు ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. హోం మంత్రి వంగల పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించినందుకు ఈ కేసు నమోదైంది.
ఈ నెల 12న టీవీ లైవ్ లో పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి అవాస్తవాలని తెలుగు రైతు మీడియా రాష్ట్ర సమన్వయకర్త గింజుపల్లి వెంకటేశ్వరరావు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కందుకూరు, కావలి, పల్నాడు జిల్లా, క్రోసూరు, మాచర్ల గ్రామీణం, వినుకొండ, నత్తెనపల్లి, నరసారావు పేట పట్టణం, అనకాపల్లి జిల్లా మునగపాక,నర్సీపట్నం, వైఎస్ ఆర్ జిల్లా మైదుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flood-of-complaints-against-posani-in-ap-25-188401.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.