Publish Date:Sep 25, 2020
విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే కనకదుర్గమ్మ వారధిపై అధికార పార్టీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తున్నట్టుగా ఆ ఫ్లెక్సీలు ఉండటమే కాకుండా.. ఆ ఫ్లెక్సీలపై ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో, వైసీపీ ముఖ్య నాయకులు జోగి రమేష్, విజయసాయి రెడ్డి ఫోటోలు ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలు వైసీపీ టియుసి నాయకులు పేర్లు, ఫోటోలతో వెలిశాయి. అయితే ఆ వివాదాస్పద ఫ్లెక్సీలు చూసి అందరూ అవాక్కయ్యారు. అందులో ఏమి ఉంది అంటే.. "రాజ్యాంగ వ్యవస్థల పేరుతో మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే మేము ఊరుకోం." అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అంతేకాదు, "మా ప్రభుత్వం ప్రజల అభిమానం ఆమోదం పొంది గెలిచింది, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు" అంటూ ఆ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చర్చనీయాంశం అయ్యాయి.
వైసీపీ టియుసి నాయకుడు మాడు శివరామ కృష్ణ పేరిట పెట్టిన ఈ ఫ్లెక్సీల్లో ఉన్న మాటలు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరిని టార్గెట్ చేసి పెట్టారు? మా ప్రభుత్వాన్ని అడ్డుకుంటే ఊరుకోం అని ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారా?. ఎవరిని బెదిరించటానికి ఇంత బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టారు? అనే చర్చ మొదలైంది. రాజ్యాంగ వ్యవస్థలు అని చెప్పి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది, మేము ఏమైనా చేస్తాం, మీరు ఎవరు ప్రశ్నించటానికి అనే ధోరణి ఎంతవరకు కరెక్ట్?. ప్రతిపక్ష పార్టీని అయితే డైరెక్ట్ గా విరుచుకుపడే వారని, ఇది కేంద్రాన్ని కానీ, కోర్టులను కానీ ఉద్దేశించి రాసినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా రాజ్యసభలో కోర్టులను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ ఆ వివాదాస్పద ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కూడా ఉంది. ఇక ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు, మంత్రి కొడాలి నాని వంటి వారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనికితోడు న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ఈ వరుస పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో జగన్ కి క్లాస్ పీకారని వార్తలొచ్చాయి. మరోవైపు, అవినీతి ఆరోపణల కేసులో జగన్ మరోసారి జైలుకి వెళ్లే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో "మా ప్రభుత్వానికి సంకెళ్ళు వెయ్యాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకోం" అంటూ ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపుతోంది. మరి ఈ వివాదాస్పద ఫ్లెక్సీలను వైసీపీ అధిష్టానం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఖండిస్తారా? లేక ఆ ఫ్లెక్సీల వెనుక మేమున్నాం అన్న పరోక్ష సంకేతాలు ఇస్తారా చూడాలి. ఏదిఏమైనా ఇలా బహిరంగంగా ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులకు దిగడం మంచి పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flexi-controversy-in-vijayawada-25-104425.html
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.