కొత్త ఏడాదిలో జీవితాన్ని మార్చే 5 మ్యాజిక్ టిప్స్ ఇవి..!

Publish Date:Dec 31, 2025

Advertisement

 

కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు. అయితే కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు వాటిని భరించాలని,  ఓర్పుతో వాటిని అధిగమించాలి.. తెలిసిన మనుషులు ఆరోగ్యం దగ్గర మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  సింపుల్ గా చెప్పాలంటే నేటికాలంలో ఆరోగ్యం విషయంలో సర్దుబాటు చేసుకునే వారు ఎక్కువ. అలాగే జీవితం అంటే ఎప్పుడూ ఇంతే అని నిరాశలో బ్రతికేవారు కూడా ఎక్కువే.  ప్రతి సారి ఇలాంటివి  మామూలే అనుకోకుండా కనీసం   కొత్త ఏడాదిలో అయినా ఆరోగ్యం, జీవితం  గురించి కాస్త శ్రద్ద పెట్టడం వల్ల మెరుగవ్వచ్చు. 5 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల జీవితమే మారిపోతుంది.  ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..

 

ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విషయాల్లో పర్పెక్ట్ గా ఉండగలం..
పైన పేర్కొన్న విషయాన్ని  స్పష్టంగా అర్థం చేసుకుంటే చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉండటం వల్ల  శక్తి, సమయం,  డబ్బు ఆదా అవుతాయి. అంతేకాదు ఇతరులకు సహాయం చేయవచ్చు. తాము ఆరోగ్యంగా, పాజిటివ్ గా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా అటు వైపు ఇన్ప్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది.

 

బరువు మాత్రమే కాదు..
చాలా మంది ఆరోగ్యం గురించి తీసుకునే నిర్ణయాలలో ఈ ఏడాది బరువు తగ్గాలి.. లాంటివి ఉంటాయి. అయితే బాగా ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం,  పొట్ట తగ్గించుకోవడం మాత్రమే కాదు. తెలివితేటలను, మనస్సును నిరంతరం మెరుగుపరచుకుంటూ ఉండాలి. జిమ్‌లో కండరాలు పెంచడానికి వ్యాయామం చేయడమే కాదు.. నలుగురికి సహాయపడటం, మానవత్వంతో ఉండటం వంటి గుణాలు కూడా ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఎన్నో రెట్లు మెరుగుపరుస్తాయి.

 

నిద్ర ముఖ్యం..
కార్పొరేట్ ఉద్యోగాలు, యంత్రాల్లా పని చేసే మనుషులు,  ఎలక్ట్రానిక్ వస్తువుల్లా సాగే శరీరాలు..  ఇది మాత్రమే కాకుండా  గాడ్జెట్‌లు నాణ్యమైన నిద్ర అంటే ఏంటో తెలియకుండా మనుషులను మార్చేశాయి. అందుకే ఈ నూతన సంవత్సరంలో నిద్ర విషయంలో రాజీ పడకూడదని ఎవరికి వారు ఒక నిబంధన పెట్టుకోవాలి. శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకోవడానికి, ఎలాంటి జబ్బులు శరీరానికి కలగకుండా ఉండటానికి  ప్రతి రాత్రి సమయానికి నిద్రపోవాలి. ఇది  నిద్ర కణాలను పునరుజ్జీవింపజేస్తుంది, మరుసటి రోజు లేవగానే ఎనర్జీగా ఉండేందుకు,  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గేందుకు సహాయపడుతుంది.

 

శ్వాస- ప్రాణ శక్తి..
ప్రతిరోజూ కొంత సమయం శ్వాసపై శ్రద్ధ వహించాలి. కాలానుగుణ పండ్లు,  కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చేస్తే శరీరంలో మంచి ఎనర్జీ, ప్రాణ శక్తి మెరుగవుతాయి. రోజువారీ అలసట అధిగమించడానికి ప్రకృతిలో సమయం గడపాలి.  సూర్యకాంతిలో గడపడం,   స్వచ్ఛమైన గాలి ఉన్న చోట  నడవడం. నేలపై చెప్పులు లేకుండా నడవడం, వంటివి చేయాలి. ప్రకృతిని గౌరవిస్తే అది ప్రేమను, శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగిస్తుంది.

 

ప్రతిభ- సామర్థ్యం..
ప్రతి వ్యక్తి తమలో ఉన్న  ప్రతిభను, సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత గొప్ప ఫలితాలు పొందగలుగుతారు. ఏదో బ్రతికేస్తున్నాం అనుకోకుండా  జీవితాన్ని మరింత అందంగా ఎలా మార్చుకోవాలో,  అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి.  ఇది జీవితంలో అబివృద్దికి దారి తీస్తుంది.

 

- రూపశ్రీ

 

By
en-us Political News

  
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.