ఏపీలో అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు

Publish Date:May 14, 2026

Advertisement

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.  ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.  తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్న వాతావరణ శాఖ..  ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించారు. 

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చిరికలు జారీ అయ్యాయి. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రక్షించుకోవాలని, ధాన్యం తడవకుండా గోదాముల్లో నిల్వ చేయాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

By
en-us Political News

  
భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు భారతీరాజా భౌతిక కాయానికి సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు.
bengaluru new eleven km flyover plan,Bengaluru new flyover, Indiranagar traffic updates, Madiwala rotary flyover, Silk Board double decker flyover, Bengaluru elevated corridor, B SMILE project DPR,teluguone,teluguone news.
ఆసియా గేమ్స్ 2026 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన యువ జట్టును ప్రకటించింది. బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిదిలను పక్కన పెట్టి సాహిబ్జాదా ఫర్హాన్‌కు కెప్టెన్సీ అప్పగించింది. ఆ పూర్తి షెడ్యూల్, టీమ్ వివరాలు ఇక్కడ చూడండి.
చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు మోహన్ నాయక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
భారత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రణేష్ మునిరత్నం హాంకాంగ్ వీసా సమస్యల్లో చిక్కుకున్నారు. జూన్ 16 నుండి జరిగే వరల్డ్ టీమ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు ముందు కోచ్ ఆర్‌.బి. రమేష్ అధికారుల సహాయాన్ని కోరుతూ చేసిన విజ్ఞప్తి వివరాలు ఇక్కడ చదవండి.
LegalZoom ద్వారా సులభంగా మరియు తక్కువ ఖర్చుతో LLC, ఎస్టేట్ ప్లాన్, మరియు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. తాజా ప్రోమో కోడ్స్ మరియు సేవింగ్స్ టిప్స్‌తో మీ వ్యాపార ఖర్చులను తగ్గించుకోండి!
సైబర్ దాడులను తిప్పికొట్టడానికి ఆంత్రోపిక్ సంస్థ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గ్లాస్‌వింగ్ లో బ్రిటన్ టెలికాం దిగ్గజం బిటి చేరింది. రోజుకు 40 లక్షల దాడులను అడ్డుకునే బిటి, క్లాడ్ మైథోస్ ఏఐ మోడల్ ద్వారా భద్రతను మరింత పెంచుతోంది. భారత్ సహా 15 దేశాలకు విస్తరించిన ఈ ఏఐ సెక్యూరిటీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
దక్షిణ కొరియా మార్కెట్లో ఐదేళ్ల గరిష్టానికి చేరిన పుట్-కాల్ రేషియో గ్లోబల్ స్టాక్ మార్కెట్ల పతనానికి సంకేతంగా మారుతోంది. గతంలో 17 శాతం కుప్పకూలిన చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారు. స్పేస్‌ఎక్స్ (SpaceX IPO 2026) ఐపీఓకు ఏకంగా $150 బిలియన్ల ఇన్వెస్టర్ డిమాండ్ వచ్చింది. సౌదీ అరామ్‌కో రికార్డును బద్దలు కొడుతూ నాస్‌డాక్‌లో ట్రేడింగ్‌కు సిద్ధమైన స్పేస్‌ఎక్స్ ఐపీఓ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో మహా సమరానికి ముందు సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ తమ జట్టును హెచ్చరించింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత వ్యూహాలు మార్చాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
లండన్ నైట్‌క్లబ్ వివాదం తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? ఈసీబీ కఠిన చర్యల నేపథ్యంలో రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్న స్టోక్స్ భవిష్యత్తుపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు బుధవారం ట్రేడింగ్‌లో 1.35% పైగా పతనమైంది. గత 5 ఏళ్లలో 371% మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్‌ను ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో, నిపుణులు సూచించిన కీలక సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను ఇక్కడ తెలుసుకోండి.
విప్రో కంపెనీ రూ. 15,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను జూన్ 11 నుండి ప్రారంభించనుంది. మార్కెట్ ధర కంటే 25 శాతం అదనపు ప్రీమియంతో రూ. 250 ఆఫర్ ధరను ప్రకటించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు లాభదాయకమైన షేర్ ఎన్‌టైటిల్‌మెంట్ రేషియో, ముఖ్యమైన తేదీలు మరియు నిపుణుల సలహాలు ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.