Publish Date:Apr 14, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను బహిష్కరించాలని మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుండి ఇటీవల నాలుగు బోట్లు మాయం అయ్యాయి. గతంలో తమిళనాడుకు చెందిన కొన్ని బోట్లు అక్రమంగా చేపల వేట సాగిస్తుండగా, స్థానిక మత్స్యకారులు వాటిని పట్టుకుని హార్బర్లో ఉంచారు. అయితే, ఆ బోట్లు అనుమానాస్పద స్థితిలో మాయం కావడంతో మత్స్యకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ బోట్ల అదృశ్యం వెనుక రాజకీయనేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మత్స్యకారులు పొలిటికల్ లీడర్ల పర్యటనలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.
మత్స్యకారుల ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మాయమైన బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు రాజకీయ పార్టీలకు, వాటి కార్యక్రమాలకు, అలాగే రాజకీయ నేతలకు తాము దూరంగా ఉంటామని కుండబద్దలు కొడుతున్నారు. తమ సమస్య పరిష్కారం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు రావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఇటు అధికార కూటమి నాయకులకు, అటు ప్రతిపక్ష వైకాపా నేతలకు కూడా సహకరించకూడదని ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాల మత్స్యకారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు జగన్ జువ్వలదిన్నె పర్యటన ఉంటుందా? రద్దౌతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా మత్స్యకార గ్రామాల్లో సామాజిక కట్టుబాట్లు చాలా బలంగా ఉంటాయి. రానున్న రోజుల్లో ఈ బోట్ల వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fisherman-decide-to-boycott-jagan-25-217376.html
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.