దశలవారీ మద్య నిషేధం దిశగా తొలి అడుగు!

Publish Date:May 17, 2023

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని 2019 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. అయితే అధికారం చేపట్టి నాలుగేళ్లయినా.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం ఎంత సుందర ముదనష్టంగా అమలు చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. మద్య నిషేధం మాట అటుంచి దిక్కుమాలిన జే బ్రాండ్ ల పేరుతో ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. అంతే కాకుండా పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చుకున్నారు.

అంటే జగన్ గత ఎన్నికల ముందు చేసిన దశల వారీ మద్య నిషేధం అన్నది ఒక బూటకపు హామీ అన్నది తేటతెల్లమైపోతుంది. పైపెచ్చు మద్యం ధరలను ఇష్టారీతిగా పెంచేయడం ద్వారా ప్రజలలో మద్యం అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ.. కొత్త కొత్త భాష్యాలు కూడా చెప్పారు. కాగా పొరుగున ఉన్న తమిళనాడులో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని స్టాలిన్ సర్కార్ రాష్ట్రంలో 500 మద్యం దుకాణాలను మూసేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా చర్యలకు కూడా ఉపక్రమించింది.  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జూన్‌ 3న కరుణానిథి శత జయంతి వేడుకలు ప్రారంభమవుతున్న సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయించారు. తొలివిడతగా 500  దుకాణాలను మూసివేయనున్నారు. ఆ మేరకు  ఉన్నతాధికారులు మూసివేయాల్సిన దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు.

ముఖ్యంగా పాఠశాలలు, ఆలయాలకు చేరువగా ఉన్న మద్యం దుకాణాలు మూత పడతాయని తెలుస్తోంది. అదే విధంగా 500 మీటర్ల దూరంలో రెండు మద్యం దుకాణాలున్న ప్రాంతాల్లో ఒకే మద్యం దుకాణం కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీలో మాత్రం వాగ్దానం చేసి నాలుగేళ్లయినా మద్యం వినియోగం పెంచడమెలా అన్న ప్రణాళికలతో జగన్ సర్కార్ ముందుకు వెళుతోంది. ఆదాయం కోసం ప్రజారోగ్యాన్ని కూడా ఫణంగా పెడుతోంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.