ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టి20 సిరీస్.. తొలి మ్యాచ్ వర్షార్పణం

Publish Date:Jul 1, 2026

Advertisement

 భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య  టి20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైంది.  డర్హమ్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ మధ్యలో భారీ వర్షం కారణంగా రద్దైంది.  ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో  భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు  విరుచుకుపడటంతో మ్యాచ్  ఫలితం తేలకుండానే రద్దయింది.  తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్  ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.  అయితే.. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే డర్హమ్‌ మైదానాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కనీసం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం తేల్చేందుకు 5 ఓవర్ల మ్యాచ్‌నైనా నిర్వహించాలని అంపైర్లు చాలా సేపు కటాఫ్ సమయం కోసం వేచి చూశారు. కానీ, వర్షం  తగ్గకపోవడంతో  మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు   ప్రకటించారు.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి. స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 1 పరుగుకే వెనుతిరగగా, మరో కీలక బ్యాటర్ ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే 0 స్కోరుకే  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ దశలో   అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలింగ్ లైన్‌ను తుత్తునియాలు చేస్తూ..  మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 అద్భుతమైన సిక్సర్లతో 59 పరుగులు చేసి స్కోరుబోర్డును రాకెట్ వేగంతో పరిగెత్తించాడు. అతనికి తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను  ముందుకు నడిపించాడు. ఇంగ్లాండ్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 47 బంతుల్లో 68 పరుగులు చేసి భారత్  భారీ స్కోరుకు దోహదపడ్డాడు. 

ఇక చివరి  ఓవర్లలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన పవర్‌హిట్టింగ్‌తో  21 బంతుల్లోనే 42 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి అజేయంగా నిలిచాడు.  ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్   3 వికెట్లు పడగొట్టగా, స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఆల్‌రౌండర్ శామ్ కరన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భారత బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఒత్తిడిలోకి నెట్టేసే సువర్ణావకాశం మన బౌలర్లకు వచ్చినప్పటికీ, వరుణుడి రాకతో ఆ ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు స్టేడియానికి వచ్చిన వేలాది మంది అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. కాగా,  ఈ టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్ జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

By
en-us Political News

  
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.