Publish Date:Apr 23, 2022
ఏప్రిల్ 24, 2021. తెలుగుజాతి గుర్తుంచుకునే రోజు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా తెలుగువారైన ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన రోజు. నేటికి సరిగ్గా ఏడాది. ఈ ఏడాది కాలంలో ఎన్నో మైలురాళ్లు. ఎన్నో చారిత్రాత్మక తీర్పులు. తెలుగువారి సత్తాను.. సామర్థ్యాన్ని.. సీజేఐగా ఘనంగా చాటారు జస్టిస్ రమణ. అందుకే, ఆయన తెలుగు నేలపై అడుగుపెట్టినప్పుడల్లా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. రమణపై ఎనలేని ఆదరాభిమానాలు చూపుతున్నారు. ఈ ఏడాది కాలంలో సీజేఐ రమణ ఇచ్చిన తీర్పులను ఓసారి గుర్తు చేసుకుంటే...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన 3 రోజుల్లోనే.. మథుర జైలులో అనారోగ్యంతో మగ్గుతున్న జర్నలిస్టు సిద్దిఖీని ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించడంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్ నెలకొంది. అది మొదలు.. పలు సంచలన తీర్పులతో ఆయన నిత్యం మీడియాలో హెడ్‌లైన్‌గా నిలుస్తున్నారు.
తాజాగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఇళ్లను, దుకాణాలను బుల్‌డోజర్లతో ధ్వంసం చేస్తుంటే.. వాటిని వెంటనే నిలిపివేయించి బాధితులకు ఊరట నిచ్చారు. యూపీ, లఖీంపూర్‌ఖేరీలో 8 మంది రైతుల మరణానికి కారకుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేసి న్యాయం పవర్ ఏంటో చూపించారు. ఇక, యడాపెడా వాడేస్తున్న రాజద్రోహ చట్టాన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించి నోటీసులు జారీ చేయడం.. పెగాసస్ స్పైవేర్‌పై విచారణ కమిటీని నియమించడం.. జస్టిస్ రమణకే సాధ్యమంటున్నారు.
న్యాయవ్యవస్థలో ఖాళీలు నింపేందుకు కీలక చర్యలు చేపట్టారు సీజేఐ రమణ. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. సుప్రీంకోర్టులో ఉన్న 9 ఖాళీలను గత ఆగస్టులోనే భర్తీ చేయించారు. అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులే ఉన్నారు. ఎన్వీ రమణ హయాంలో హైకోర్టులకు 126 మంది న్యాయమూర్తులను నియమించారు. వీరిలో 20 శాతం మహిళలే. తెలంగాణ హైకోర్టు బెంచ్‌లో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రరీ సెంటర్ ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ ఆయనే.
ఇక, ప్రజలు రాస్తున్న లేఖలపై సీజేఐ రమణ స్పందన స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. తనకు లేఖ రాసిన కేరళ విద్యార్థినికి జవాబు రాసి ఆమెకు రాజ్యాంగ ప్రతిని బహూకరించడం.. తెలంగాణ చిన్నారి వైష్ణవి రాసిన లేఖకు స్పందించి.. ఆమె ఊరుకు స్కూలు బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవడం.. విడిపోయిన తెలుగు దంపతులు 20 ఏళ్ల తర్వాత కలిసి జీవించేలా వారితో తెలుగులోనే మాట్లాడి ఒప్పించడం.. ఇలా ఏడాది కాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో తనదైన ముద్ర వేశారు తెలుగుతేజం జస్టిస్ ఎన్వీ రమణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/first-anniversary-of-nv-ramana-as-cji-25-134824.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.