అగ్రరాజ్యంలో రాజ్యమేలుతున్న అరాచకం.. ఎలిమెంటరీ స్కూల్లో కాల్పులు.. 21 మంది మృతి

Publish Date:May 24, 2022

Advertisement

పేరుకే అగ్రరాజ్యం.. అక్కడ రాజ్యమేలేది అరాచకం. విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటం అక్కడ సాధారణం. తాజాగా టెక్సాస్ లోని ఒక ఎలిమెంటరీ స్కూల్ లో 18 ఏళ్ల యువకులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది చిన్నారులు సహా 21 మంది మరణించారు. మంగళవారం జరిగిన ఈ సంఘటనతో అమెరికాయే కాదు మొత్తం ప్రపంచం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఒక వాహనంలో వచ్చిన టీనేజర్ స్కూలు పిల్లలే లక్ష్యంగా కాల్పులు జరిపాడు.
 రు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది.  పోలీసు కాల్పుల్లో అతడు కూడా మరణించాడు. మరణించిన చిన్నారులంతా 7 నుంచి పదేళ్ల లోపు వారే. మరో పాతిక మంది చిన్నారులూ, ఆరుగురు టీచర్లూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్త మౌతున్నది. వరుసగా కాల్పుల సంఘటనలు జరుగుతున్నా పాఠశాలలు, విద్యా సంస్థల్లో కొత్త వారిని అనుమతించే విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంపై అమెరికా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసి పడుతున్నాయి.

పేరుకే అగ్రరాజ్యం కానీ ప్రజల ప్రాణాలకు భద్రత లేని నరకం అన్న విమర్శలు వివిధ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలో అమెరికాలో ఇలా కాల్పుల సంఘటన జరగడం ఇది మూడో సారి కావడాన్ని ఈ సందర్భంగా ఆ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.

దేశంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు.  నాలుగేళ్ల కిందట కూడా అమెరికాలో ఇటువంటి సంఘటనే జరిగింది. ఫ్లోరిడాలోని ఒక స్కూలులో జరిగిన కాల్పుల సంఘటనలో 15 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్చు మరణించారు. అగ్రరాజ్యంలో అరాచకత్వం, హింసా ప్రవృతి పెరిగిపోతున్నదన్న ఆందోళన మానవ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు బైడన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతులకు సంతాప సూచకంగా నాలుగు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.