తాడేపల్లి ప్యాలెస్ బయట మంటలు.. ఇది గులకరాయా? కోడి కత్తా

Publish Date:Feb 5, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు ఆవలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనిని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.  మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంటి వద్ద మంటలు చెలరేగడంపై వైసీపీ చేస్తున్న అతి చూస్తుంటే అనుమానంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ నివాసం బయట రోడ్డు పక్కన బుధవారం సాయంత్రం రెండు సార్లు మంటలు వచ్చాయి. తీరా చూస్తే అది చాలా చిన్న అగ్ని ప్రమాదం. దీనికే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. జగన్ పై హత్యాయత్నం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఈ స్వల్ప అగ్నిప్రమాదం కూడా జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కు దూరంగా రోడ్డుకు ఆవలి పక్కన జరిగింది. ఈ స్వల్ప అగ్నిప్రమాదంపై జగన్ బ్యాచ్ చేస్తున్న హడావుడీ హంగామా చూస్తుంటే..  గతంలో జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి, గులకరాయి దాడులు గుర్తుకు వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఇలా ఉండగా అది ప్రమాద వశాత్తూ జరిగింది కాదనీ,   జగన్ హయాంలో మద్యం స్కాంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిట్ వేయగానే.. తాడేపల్లి పునాదులు ఎక్కడ కదిలిపోతాయోన్న భయంతో  ఆ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు, డైరీలను వైసీపీయులే తగలబెట్టేసి, అగ్ని ప్రమాదం, భద్రతా లోపం అంటూ కథలల్లుతున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భూ దందాకు సంబంధించిన ఫైళ్లను దగ్ధం చేయడానికి ఏకంగా మదనపల్లి తహశీల్దార్ కార్యాలయంలోనే అగ్నిప్రమాదాన్ని సృష్టించిన ఘనత వైసీపీదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. 

నిజంగానే  భద్రతా లోపం కారణంగా జరిగిన అగ్నిప్రమాదం అయితే బుధవారం సాయంత్రం మంటలు చెలరేగితే దాని సీసీ ఫుటేజీని ఇంత వరకూ ఎందుకు బయటపెట్టలేదని తెలుగుదేశం ప్రశ్నిస్తున్నది.  తానే దాడులు చేయించుకుని తానే ఎదుటి వారిపై నిందలు వేయడం జగన్ కు అలవాటేనంటూ తెలుగుదేశం ట్వీట్ చేసింది.  తానే తగులబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? అంటూ నిలవీసింది. ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్' అని ఆ ట్వీట్ లో పేర్కొంది. తెలుగుదేశం, వైసీపీల విమర్శలు ఆరోపణలు అలా ఉంచితా.. అసలు అగ్ని ప్రమాదం జరిగిన తీరే చాలా అనుమానాస్పదంగా ఉంది.  మంటలు వస్తున్నా జగన్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని ఆర్పండంపై కాకుండా వీడియోలు తీయడంపైనే శ్రద్ధ చూపడం ఉద్దేశపూర్వకంగానే అక్కడ వేటినో తగులబెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అన్నిటికీ మించి అతి స్వల్పంగా వచ్చిన మంటలపై వైసీపీ ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం ఎందుకు చేస్తున్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.   

అగ్ని ప్రమాదం మాటున, జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు ధ్వంసం చేసినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై తెలుగుదేశం కూటమి  సిట్   వేయగానే  జగన్ ఇంటి ముందు స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం.. ఆ ప్రదేశంలో కొన్ని కాగితాలు కాలి ఉండటంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. 

జగన్ విదేశీ పర్యటన ముగించుకుని, ఆ తరువాత బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుని చాలా రోజుల తరువాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణంపై సీట్ ఏర్పాటు చేసిందని తెలియడంతోనే ప్యాలెస్ లో  ఉన్న మద్యం కుంభకోణానికి సంబంధించి పత్రాలను బయటపడేసి తగులబెట్టించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తాడేపల్లి ప్యాలెస్ లో  దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకూ వీడియోలు తీయగల అధునాతన సీసీటీవీ లు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలను బయటపెడితే జగన్ తాడేపల్లి ప్యాలెస్ బయట జరిగిన అగ్నిప్రమాదం వివరాలన్నీ బయటకు వస్తాయి. అయితే ఆ పని చేయకుండా జగన్ పై హత్యాయత్నం, ఇళ్లు తగలెట్లే యత్నం అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊరూవాడా ఏకమయ్యేలా చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. బాబాయ్ గొడ్డలి పోటు, కోడికత్తి దాడి, గులకరాయి దాడి సందర్భంగా వైసీపీ వ్యవహరించినట్లుగానే ఇక్కడా సానుభూతి ప్రోది చేసుకోవడానికి పడుతున్న తాపత్రయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సానుభూతికి తోడు.. మద్యం కుంభకోణం ఫైళ్లను కూడా దగ్ధం చేసేసి ఒకే దెబ్బకు రెండు లాభాలు పొందే అవకాశం కోసం అర్రులు చాచినట్లుగా కనిపిస్తోందంటేన్నారు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది.
తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు.
ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే సినిమాల్లో మ‌న‌కు స్టార్ డ‌మ్ ఎలాంటిదో తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమ‌కు అతి పెద్ద హీరో చిత్తూరు నాగ‌య్య‌.. అప్ప‌ట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వ‌చ్చినా ఆయ‌నే చేసేవారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ పాతాళ భైర‌వి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైన‌మిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నియ్యారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలితంగా.. అమరవీరుల త్యాగాల ఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, జూన్ 2. అవును తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలా ఘనంగా జరుపుకుంటారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకంలో అంశలను పరిశీలించి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు.
యువనేత లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కావాలని టీడీపీ కార్యకర్తల నుంచి బలంగా డిమాండ్ వస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కడప మహానాడు’ ప్రాంగణంలో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలంతా ఈ డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత స్పీడ్ ఓ రేంజ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కవిత బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ నరేంద్ర మహానాడులో తీర్మానించారు. ఈ విష‌య‌మై గుంటూరు జిల్లా స్థాయిలో జ‌రిగిన మినీ మహానాడులో తీర్మానం చేసిన‌ట్లు చంద్ర‌బాబుతో ఎమ్మెల్యే తెలియ‌జేశారు
కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న ప్రచారం జోరందుకుంది.
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అందులో విశేషం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ నెల 30న మరో సారి కూడా వెడతారు. గ డచిన 17 నెలల్లో మొత్తం 44 సార్లు.. అంటే సగటున నెలకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు చేశారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నెలలో రెండు సార్లు కాదు, ఒకే రోజులో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.