Publish Date:Aug 13, 2025
అమరావతి సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఇవాళ తొలిసారిగా నిర్వహించారు.
Publish Date:Aug 13, 2025
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. ఈ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు రంగంలోకి దిగడంతోనే ఇంత కాలం మా కంచుకోట, అడ్డా.. ఇక్కడ మాకు ఎదురే లేదు అంటూ వైసీపీ పలుకులన్నీ ఉత్త డొల్లేనని అవగతమైపోయింది.
Publish Date:Aug 13, 2025
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Publish Date:Aug 13, 2025
గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్ కుటుంబం మళ్ళీ తెలుగుదేశంలోకి రీఎంట్రీ పై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఏపి రాజకీయాలలో ఉద్దండుడు. రెండు సార్లు చిత్తూరు ఎంపీగా గెలిచారు.
Publish Date:Aug 13, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Publish Date:Aug 13, 2025
కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పోటెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న అన్ని డ్యామ్ ల గేట్లనూ ఎత్తి అధికారులు లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Publish Date:Aug 13, 2025
భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైపోతోంది. రహదారులు జలమయమై ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని ప్రాంతాలకైతే బాహ్యప్రపంచంతో సంబంధాలే తెగిపోయాయి.
Publish Date:Aug 13, 2025
ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఓ షాపు యజమానిపై గంజాయి మత్తులో కొందరు పోకిరీలు దాడి చేశారు.
Publish Date:Aug 13, 2025
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కావాలని డిమాండ్ చేసి మరీ సాధించుకున్న వైసీపీ.. ఆ రీపోలింగ్ ను బహిష్కరించింది. కోరి సాధించుకున్న రీపోలింగ్ ను బహిష్కరించడానికి కారణం జనం వారి వైపు లేరని తెలిసిపోవడం వల్లనే అంటున్నారు పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి.
Publish Date:Aug 13, 2025
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Publish Date:Aug 13, 2025
వివాదాలతో నిత్యం సహవాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) అరెస్టు చేశారు. ఆ వెంటనే ఇద్దరు వ్యక్తుల సూరిటీతో స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశారు.
Publish Date:Aug 13, 2025
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావలితో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి హందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఆ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తదితరులు హాజరయ్యారు.
Publish Date:Aug 13, 2025
గత ఏడాది ఎన్నికలలో ఈవీఎంల వల్ల ఓడిపోయాం.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక జరిగినా రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేక ఓడిపోతున్నాం అంటున్నారు వైసీపీ నేతలు.