Publish Date:May 18, 2022
కార్చిచ్చు కమ్ముకొస్తోంది. ఎల్ ఓసీ వద్ద అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న నిప్పు బడబాలనంగా మారి భారత భూభాగంలోని మెందార్ సెక్టార్లోకి చొచ్చుకు వచ్చింది. దీని ప్రభావంతో జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో ఉన్న ల్యాండ్మైన్లు పేలుతున్నాయి. సరిహద్దు ప్రాంతం కావడంతో ఉగ్ర చొరబాట్లను నియంత్రించేందుకు ఈ ప్రాంతంలో సైనికులు ల్యాండ్మైన్లు ఏర్పాటు చేస్తుంటారు.
అయితే, కార్చిచ్చు వల్ల చెలరేగిన మంటలతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ల్యాండ్మైన్లు పేలుతున్నాయి. ఇప్పటి వరకూ కార్చిచ్చు వల్ల ఆరు ల్యాండ్మైన్లు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటలను ఆర్పేందుకు ఆర్మీ, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ల్యాండ్ మైన్లు పేలిపోవడం, కార్చిచ్చు కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఇదే అదునుగా పాక్ సరిహద్దులు దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమౌతున్నది.
గురువారం ఉదయం నాటికి కూడా అటవీ ప్రాంతంలో మంటలు అదుపులోనికి రాలేదని తెలుస్తున్నది. బలంగా వీస్తున్న గాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-in-forest-near-loc-entering-into-india-25-136097.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.