పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం
Publish Date:May 21, 2026
Advertisement
పాతబస్తీలోని మదీనా చౌరస్తాలో గురువారం(మే 21) ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని వస్త్రదుకాణంలో మంటలు వ్యాపించి వేగంగా భవనం మొత్తానికి విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. అయితే భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని అంటున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fire-accident-in-hyderabad-36-220465.html
http://www.teluguone.com/news/content/fire-accident-in-hyderabad-36-220465.html
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 29, 2026
Publish Date:Aug 28, 2026
Publish Date:Aug 28, 2026





